Wayanad Landslides: 405కి చేరిన మృతుల సంఖ్య.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

  • 405కి చేరిన వయనాడ్ మృతుల సంఖ్య
  • కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Wayanadlandslides

Wayanadlandslides

వయనాడ్ ప్రకృతి విలయంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 405కి చేరింది. గత మంగళవారం అర్ధరాత్రి వచ్చిన విలయంతో వందలాది మంది ప్రవాహంలో కొట్టుకుపోయారు. బురదలో కూరుకుపోయి నివాసితులు చనిపోయారు. ఇప్పటి వరకు 405 మృతదేహాలను వెలికి తీశారు. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. మరో వైపు వందలాది మంది బాధితులు ఆస్పత్రుల్లో కోలుకుంటున్నారు. ఇదిలా ఉంటే తేయాకు తోటలో పనిచేస్తూ గల్లంతైన వారికి కోసం అన్వేషణ కొనసాగుతోంది. పది అడుగుల మేర కూరుకుపోయిన బురదలో మృతదేహాలు దొరుకుతున్నాయి. ఇక దెబ్బతిన్న ఇళ్లను అధికారులు పూర్తిగా నేలమట్టం చేస్తున్నారు.