Site icon NTV Telugu

DCGI: గుడ్‌న్యూస్‌.. చిన్నారుల వ్యాక్సిన్‌కు అనుమతి

కరోనా మహమ్మారికి చెక్‌ పెట్టేందుకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది… ఇక, క్రమంగా ఏజ్‌ గ్రూప్‌ను తగ్గిస్తూ.. వ్యాక్సిన్‌ ప్రక్రియ కొనసాగిస్తోంది ప్రభుత్వం.. ఈ నేపథ్యంలో చిన్నారుల వ్యాక్సిన్‌పై గుడ్‌న్యూస్‌ చెప్పింది డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ)… సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన కోవోవాక్స్‌ కొవిడ్‌ టీకాకు అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది డీసీజీఐ. ఈ విషయాన్ని సీరం సీఈవో అదర్‌ పునావాలా తెలిపారు.. 12 ఏళ్లు పైబడిన వారందరికి వ్యాక్సిన్‌ వేసేందుకు డీసీజీఐ అనుమతి ఇచ్చిందని ప్రకటించారు.. కాగా, కోవోవాక్స్‌ టీకా 18 సంవత్సరాలు అంతకంటే తక్కువ వయసున్న వారికి అందుబాటులోకి వచ్చిన నాల్గో టీకాగా నిలిచిన విషయం తెలిసిందే..

Read Also: Goa: ఫలితాలపై ఉత్కంఠ.. క్యాంపులకు అభ్యర్థులు..

గ్లోబల్ ట్రయల్స్‌లో కోవోవాక్స్‌ 90 శాతం కంటే ఎక్కువ సామర్థ్యాన్ని ప్రదర్శించింది. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా బ్రాండ్ కోవోవాక్స్‌ భారతదేశంలో బ్రిడ్జింగ్ అధ్యయనాలను పూర్తి చేసింది. 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు DCGI ద్వారా అత్యవసర వినియోగ అధికారాన్ని మంజూరు చేసింది. ఇటీవల, సబ్జెక్ట్ నిపుణుల కమిటీ 12 నుండి 17 సంవత్సరాల మధ్య కోవోవాక్స్‌కు అత్యవసర వినియోగ అధికారాన్ని సిఫార్సు చేసింది. అంతకు ముందు, డీసీజీఐ గత సంవత్సరం డిసెంబరు 28న పెద్దలకు అత్యవసర పరిస్థితుల్లో పరిమిత ఉపయోగం కోసం Covovaxని ఆమోదించింది. ఇటీవల సీడీఎస్‌సీవో కొవిడ్‌-19 సబ్జెక్ట్‌ నిపుణుల కమిటీ ఇటీవల సిఫారు చేసింది. ఈ క్రమంలో తాజాగా డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా అనుమతి ఇచ్చింది.

Exit mobile version