విమానంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది.. ఓ ఎంపీ పైలట్‌గా మారి విమానాన్ని గాల్లో ఎగిరిస్తే.. మరో ఎంపీ ప్రయాణికుడికిగా అతడితో పాటు ప్రయాణం చేశారు.. అయితే, ఇద్దరూ సుపరిచితులు కావడంతో.. వారి పలకరింపులు, ఒకరిని చూసి ఒకరు ఆశ్చర్యానికి గురికావడం ఆ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడంతో.. ఆ అరుదైన ఘటన అందరికీ ఆసక్తికరంగా మారిపోయింది. ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. డీఎంకే సీనియర్ ఎంపీ దయానిధి మారన్, బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ గత శుక్రవారం ఢిల్లీ నుంచి చెన్నై వెళ్లే ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్నారు. విమానంలో ముందు వరుసలో ఉన్న సీట్లో కూర్చొన్నారు మారన్… అంతలోనే మీరు కూడా ఈ విమానంలో ప్రయాణిస్తున్నారా? అని ఓ గొంతు ఆయనను పలకరించింది. మారన్ వెనక్కి తిరిగి చూడగానే ప్లైట్ కెప్టెన్ యూనిఫామ్ లో ఓ వ్యక్తి కనిపించారు. మాస్క్ కూడా వేసుకుని ఉండటంతో మొదట గుర్తుపట్టని మారన్.. తర్వాత మాత్రం గొంతు విని తన సహచర ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీగా గుర్తించి ఆశ్చర్యపోయారు. ఈ ఘటనను సోషల్ మీడియాలో పంచుకున్నారు మారన్..
సిట్టింగ్ పార్లమెంటు సభ్యుడుగా ఉన్న రూడీ.. విమానానికి తరచుగా కెప్టెన్‌గా చేస్తారు.. నేను చాలాకాలం దీని గురించి మాట్లాడుతునానని ఖచ్చితంగా తెలుసు. ఢిల్లీ నుంచి చెన్నైకి మమ్మల్ని సురక్షితంగా తీసుకొచ్చినందుకు ఎంపీ కెప్టెన్ రాజీవ్ ప్రతాప్ రూడీకి ధన్యవాదాలు.. నా మంచి స్నేహితుడుతో నేను విమానంలో వచ్చినందకు నేను గౌరవించబడ్డానని మాత్రం చెప్పగలను.. అంటూ ట్వీట్ చేశారు.. కాగా, మాజీ పౌర విమానయాన మంత్రి అయిన రూడీ… బీహార్‌కు చెందిన లోక్‌సభ ఎంపి, బిజెపి జాతీయ ప్రతినిధి. మారన్ తండ్రి మురసోలి మారన్ కేంద్ర వాణిజ్య మంత్రిగా ఉన్నప్పుడు రూడీ రాష్ట్ర మంత్రిగా పనిచేశారు.