NTV Telugu Site icon

Delhi Cafe Owner Suicide: “భార్య వేధింపులే కారణం”.. సంచలన విషయాలు చెప్పిన పునీత్ సోదరి..

Delhi Cafe Owner Suicide

Delhi Cafe Owner Suicide

Delhi Cafe Owner Suicide: బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య వ్యవహారం ఇటీవల సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. భార్య నిఖితా సింఘానియా వేధింపులు, తప్పుడు కేసుల కారణంగా సుభాష్ ఆత్మహత్య చేసుకున్నారు. 24 పేజీల సూసైడ్ లేఖతో పాటు గంటకు పైగా వీడియోని రికార్డ్ చేసి, భార్య ఆమె కుటుంబం వేధింపులను చెప్పాడు.

ఇదిలా ఉంటే, తాజాగా మరో వ్యక్తి కూడా భార్య వేధింపులకు బలయ్యాడు. ఢిల్లీకి చెందిన కేఫ్ ఓనర్ పునీత్ ఖురానా(40), విడిపోయిన భార్య మాణికా పహ్వా, ఆమె కుటుంబం నుంచి వేధింపులు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ వేధింపుల కారణంగానే పునీత్ ఆత్మహత్య చేసుకున్నట్లు అతడి కుటుంబం ఆరోపిస్తోంది. భార్య మాణికా పహ్వా అతడిని మానసికంగా వేధించిందని కుటుంబీకులు ఆరోపించారు. నిన్న మోడల్ టౌన్ నివాసంలో పునీత్ ఆత్మహత్య చేసుకున్నాడు.

పునీత్ సోదరి మాట్లాడుతూ.. ‘‘ మాణికా పహ్వా, ఆమె తల్లిదండ్రులు, ఆమె సోదరి కలిసి పునీత్‌ని వేధించారు. అతడిపై ఒత్తిడి తీసుకువచ్చిన నువ్వు ఏం చేయలేవని, నీకు ధైర్యం ఉంటే ఆత్మహత్య చేసుకుని చచ్చిపో అని ప్రేరేపించారు.’’ అని చెప్పింది. పునీత్ మరణానికి ముందు అతడి ఫోన్‌లో ఓ వీడియో రికార్డ్ చేశారు. మానికా, ఆమె తల్లిదండ్రుల వేధింపుల గురించి అందులో చెప్పాడు.

Read Also: Israel: అక్టోబర్ 07 దాడులకు నేతృత్వం వహించిన హమాస్ కమాండర్ హతం..

పునీత్, మాణికా మధ్య వ్యాపారం వివాదం కూడా ఉందని పునీత్ సోదరి చెప్పారు. ‘‘ఇంతకుముందు వారు పార్ట్‌నర్‌షిప్‌లో బేకరీ వ్యాపారం చేశారని, కానీ విడాకుల కోసం సంతకాలు జరిగిన తర్వాత పునీత్ గాడ్స్ బేకరీని, మాణికా వుడ్‌బాక్స్ కేఫ్‌ని నిర్వహించాలని రాతపూర్వకంగా నిర్ణయించారు. దీని తర్వాత, ఆమె తన షేర్‌ని వదులోనని చెప్పింది. ఆమె పునీత్‌కి తరుచూ ఫోన్ చేస్తూ తన వాటాని కోరింది’’ అని పునీత్ సోదరి చెప్పారు.

పునీత్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని మాణికా హ్యాక్ చేసిందని, దీని ద్వారా ఆమె ఇతర వ్యక్తులతో అనుచితంగా ప్రవర్తించిందని పుతీన్ సోదరి చెప్పారు. దీని కారణంగా తన సోదరుడు తెల్లవారుజామున 3 గంటలకు కాల్ చేయాల్సి వచ్చిందని, తమ వద్ద రికార్డింగ్ ఉందని ఆమె చెప్పారు. విడిపోయిన తర్వాత తన కొడుకు బాగుంటాడని పునీత్ తల్లి చెప్పింది. కానీ మణికా మాత్రం తన కొడుకుని చిత్రహింసలు పెట్టిందని, అన్నింటిని మౌనంగా భరించాలని ఆవేదన వ్యక్తం చేసింది. తాము బాధపడుతామని ఒక్క విషయం కూడా తమకు చెప్పలేదని పునీత్ తల్లి కన్నీటిపర్యంతమయ్యారు. తన కొడుకుని కోల్పోయానని, దయచేసి తమకు న్యాయం చేయాలని పునీత్ తల్లి కోరారు. 2016లో పునీత్‌కి మాణికాతో వివాహం జరిగింది. వీరిద్దరు ఇప్పుడు విడాకులు తీసుకునే ప్రక్రియలో ఉన్నారు. రెండేళ్ల క్రితమే వీరు విడిపోయారు.

Show comments