Site icon NTV Telugu

Kedarnath Dham: కేదార్‌నాథ్ ఆలయ ప్రాంగణంలో డీజే మ్యూజిక్, డ్యాన్స్.. కేసు నమోదు..

Kedarnath Dham

Kedarnath Dham

Kedarnath Dham: ఉత్తరాఖండ్ కేదార్‌నాథ్ ఆలయ ప్రాంగణంలో యాత్రికులు డీజే మ్యూజిక్, డ్యాన్సులు చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. పవిత్రమైన ఆలయం ముందు డ్యాన్సులు, డీజే మ్యూజిక ఏంటని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

రుద్రప్రయాగ్ జిల్లాలోని కేదార్‌నాథ్ ధామ్ ద్వారాలను మే 2న భక్తుల కోసం తెరిచారు, బద్రీనాథ్ ధామ్ ద్వారాలను మే 4న, గంగోత్రి, యమునోత్రి ధామ్‌ల ద్వారాలను ఏప్రిల్ 30న తెరిచారు. కేదార్‌నాధ్ ఆలయం ప్రాంగణంలో ఈ సంఘటన ఆలయ ద్వారాలు తెరవడానికి ముందే రికార్డ్ చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.

Read Also: New Ration Cards: కొత్త రేషన్ కార్డులపై ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..

వీడియో వైరల్ అయిన తర్వాత, రుద్రప్రయాగ్ అధికారులు ఆలయ పవిత్రతను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేశారు. ఈ ఉల్లంఘనలకు పాల్పడిన వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నిబంధనల ప్రకారం, నిందితులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

చార్ ధామ్ యాత్ర అధికారికంగా ప్రారంభం కావడంతో, పెద్ద సంఖ్యలో యాత్రికులు ఉత్తరాఖండ్‌కు వస్తున్నారు. యాత్రికులు ఆలయ సమీపంలో రీల్స్, ఫోటో షూట్ వంటివి చేయడాన్ని అధికారులు, ఆలయ నిర్వాహకులు నిషేధించారు. కేదార్‌నాథ్ పవిత్రతకు భంగం కలిగించే ఏ చర్యలకు పాల్పడిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. రీల్స్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ (BKTC) కఠినమైన నిర్ణయం తీసుకుంది. మొబైల్ ఫోన్లు జప్తు చేయడంతో పాటు రూ. 5000 జరిమానా విధించే నిబంధనలు తీసుకువచ్చారు.

Exit mobile version