Site icon NTV Telugu

Motel Killing: డల్లాస్ ‘‘నాగమల్లయ్య’’ హత్యతో ప్రవాసుల్లో భయం.. రెడ్డిట్ పోస్ట్ వైరల్..

Motel Killing

Motel Killing

Motel Killing: అమెరికాలోని ఒక మోటల్‌లో భారత సంతతి వ్యక్తి దారుణహత్య ప్రవాసుల్లో తీవ్ర భయాందోళనల్ని రేకెత్తించింది. అత్యంత పాశవికంగా నిందితుడు తలను శరీరం నుంచి వేరు చేసి హత్య చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాల్లో వైరల్‌గా మారింది. భార్య, కుమారుడి ముందే ఈ దారుణహత్య జరిగింది. అయితే, డల్లాస్‌లో జరిగిన ఈ హత్య తర్వాత ఎన్ఐఆర్‌లో భయం మొదలైంది. వారంతా ఇప్పుడు తమ భద్రత గురించి భయపడుతున్నారు. రెడ్డిట్‌లో ‘‘ఏ ట్రాజెడీ దట్ టూ క్లోజ్ టూ హోమ్’’ అనే వైరల్ పోస్టులో ఎన్ఐఆర్ తన ఆందోళనల్ని వెల్లడించారు.

‘‘డల్లాస్ మోటల్ లో జరిగిన సంఘటన సొంత దేశం నుంచి అమెరికాలో స్థిరపడిన వారికి ఒక మేల్కొలుపు’’ అని ప్రవాస భారతీయుడు పేర్కొన్నారు. ‘‘ ఇటీవల అమెరికా లోని ఒక మోటల్‌లో భారత సంతతి వ్యక్తి హత్య గురించి చదివినప్పుడు, నేను దానిని తోసిపుచ్చలేకపోయానున. ఆ వార్త దిగ్భ్రాంతికరమైనది, ఈ హత్య నిజంగా నన్ను తాకింది. ఆయనకు తెలిసిన వ్యక్తి కావచ్చు. అది మనలో ఎవరైనా కావచ్చు’’ అని యూజర్ r/nri సబ్‌రెడిట్‌లో రాశారు. విదేశాల్లో జీవితం బయట నుంచి ఆకర్షణీయంగా కనిపించవచ్చు, కానీ వాస్తవం భిన్నంగా ఉంటుందని ఎన్ఆర్ఐ పేర్కొన్నారు. ముఖ్యంగా మోటల్స్, గ్యాస్ స్టేషన్లు, దీర్ఘకాల ఉద్యోగాల్లో పనిచేసే వారికి అని చెప్పారు.

Read Also: Minister Satya Kumar: ఉచిత బస్సుపై మంత్రి మరోసారి సెటర్లు.. సంక్షోభం నుంచి అభివృద్ధి దిశగా ఏపీ!

‘‘రాత్రుల్లో ఒంటరిగా ఉండటం, అపరిచితులకు కనిపించడం భారతదేశంలో మనకు తెలియని ప్రమాదాలు’’ అని ఆయన చెప్పారు. ఈ విషాద ఘటన మూడు విషయాల గురించి ఆలోచించేలా చేసిందని అన్నారు. సమాజమే ప్రతీది, భద్రత అనేది ఆటోమెటిక్ కాదు. భయాన్ని సృష్టించడానికి నేను దీనిని రాయడం లేదు. నేను దీనిని గుర్తు చేయడానికి రాస్తున్నా. విదేశాలకు వెళ్లడం ఎప్పుడూ జీతం లేదా పాస్‌పోర్టు గురించి మాత్రమే కాదు. మీరు దేన్ని వదిలివస్తున్నారు, ఏ రిస్క్ తీసుకుంటారు, వలస జీవితానికి మరోవైపు సమస్యల్ని ఎదుర్కొనేందుకు ఎంత సిద్ధంగా ఉన్నారనే దాని గురించి’’ అని రాసుకొచ్చారు.

ఈ పోస్ట్ వైరల్ కావడంతో, సోషల్ మీడియా యూజర్లు ఈ సంఘటనపై భిన్నమైన దృక్పథాలనున పంచుకుంటున్నారు. నాకు కొన్ని హోటళ్ల ఉన్నాయి. ‘‘నేను మీతో ఏకీభవిస్తున్నాను. ఇది ప్రమాదకరమైన పరిశ్రమ. మీరు అందులో పనిచేసే వరకు తెలియదు’’ అని ఒక యూజర్ స్పందించారు. ‘‘దూరం నుంచి చూస్తే, ముఖ్యంగా సాంస్కృతిక క్షీణత, నాణ్యత విషయాలనికి వస్తే అమెరికా పెద్ద గందరగోళంగా కనిపిస్తుంది’’ అని మరొకరు వ్యాఖ్యానించారు. ‘‘బుల్లెట్ల స్వేచ్ఛతో ఇది ఎప్పుడూ సురక్షితం కాదు. ఎవరైనా యూఎస్ సురక్షితం అనే భ్రమల్లో ఉంటే, వారికి వాస్తవికత అవసరం’’ అని మూడో వ్యక్తి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

కర్ణాటకు చెందిన చంద్ర నాగమల్లయ్య, డైన్ టౌన్‌కు తూర్పున ఉన్న సామ్యూల్ బౌలేవార్డ్‌లోని డౌన్‌టౌన్ సూట్స్ మోటల్ మేనేజర్. వాషింగ్ మిషన్‌ విషయంలో కోబో మార్టినెజ్ అనే వ్యక్తితో గొడవ కాస్త హత్యకు దారితీసింది. మార్టినేస్ నాగమల్లయ్య తల నరికి హత్య చేశాడు.

Exit mobile version