Site icon NTV Telugu

IMD: మే 6 నాటికి బంగాళాఖాతంలో వాయుగుండం.. ఐఎండీ రిపోర్ట్..

Imd

Imd

Cyclonic Circulation: భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) కీలక ప్రకటన చేసింది. మే 6 వరకు ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో మరో 48 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడవచ్చని ఐఎండీ మంగళవారం తెలిపింది. యూఎస్ వెదర్ ఫోర్‌కాస్ట్ మోడల్ గ్లోబర్ ఫోర్‌కాస్ట్ సిస్టమ్(GFS), యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రెంజ్ వెదర్ ఫోర్‌కాస్ట్ (ECMWF) బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. దీని తర్వాత ఐఎండీ కూడా తాజా నివేదికలో వాయుగుండం ఏర్పడుతుందని వెల్లడించింది.

Read Also: Rahul Gandhi Defamation Case: రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బ.. లభించని ఊరట..

అయితే కొన్ని మోడల్స్ ప్రకారం తుఫాన్ ఏర్పడుతుందని అంచానా వేస్తున్నాయి. ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులను గమనిస్తున్నామని ఐఎండీ డైరెక్టర్ మృత్యుంజయ్ మహపాత్ర తెలిపారు. మే మొదటి అర్థభాగంలో ఉష్ణమండల తుఫాన్ వచ్చే అవకాశం తక్కువ అని స్కైమేట్ వెదర్ తెలిపింది. ఏప్రిల్ నెలలో భారత సముద్రాల్లో తుఫాన్ ఏర్పడలేదు. వరసగా నాలుగో ఏడాది కూడా ఏప్రిల్ నెలలో తుఫానులు ఏర్పడలేదు.

Exit mobile version