NTV Telugu Site icon

Cyclone Asna: అరేబియా సముద్రంలో అస్నా తుఫాన్.. భారత్కు ఐఎండీ అలర్ట్..!

Asna Cyclone

Asna Cyclone

Cyclone Asna: అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం ఉదయం తుఫాన్ ​గా మారింది.. దీంతో గత కొన్ని రోజులుగా గుజరాత్ రాష్ట్రంలో కుండపోత వర్షాలకు కారణమైంది అని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఇక, గుజరాత్ తీరం నుంచి దూరంగా పాకిస్థాన్ వైపు కదులుతోందని చెప్పుకొచ్చింది. ఈ తుఫాన్ కు పాక్​ సూచించిన మేరకు ‘అస్నా’ అని నామకరణం చేసినట్టు వెల్లడించారు. 1976వ సంవత్సరం నుంచీ ఆగస్టు నెలలో అరేబియా సముద్రంలో తుఫాన్ ఏర్పడటం ఇది నాలుగోసారి అని భారత వాతావరణ శాఖ ప్రకటించింది.

Read Also: Lotus Seeds: మఖానా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవా..?

ఇంతకుముందు 1944, 1964, 1976 సంవత్సరాల్లోని ఆగస్టు నెలల్లో మాత్రమే అరేబియా సముద్రంలో తుఫాన్ ఏర్పడుతుందని.. అవి బలహీన తుఫాన్లుగానే నమోదయ్యాయని తెలిపింది. తాజాగా ఏర్పడిన సైక్లోన్ అస్నా గుజరాత్ లోని భుజ్ కు 190 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందన్నారు. అది మరో రెండు రోజుల్లో భారత తీరానికి దూరంగా వెళ్లిపోతుందని ఐఎండీ సూచించింది. అయితే, ఆగస్టులో తుఫాన్‌లు రావడం చాలా అరుదు.. కానీ, సముద్రాలు వేడెక్కడంతో ఈ తుఫాన్‌లు ఏర్పడింది పేర్కొన్నారు.

Show comments