NTV Telugu Site icon

CWC Meeting: నేడు సీడబ్ల్యూసీ సమావేశం.. హాజరుకానున్న తెలుగు రాష్ట్రాల నేతలు..

Mallikarjuna Kharge

Mallikarjuna Kharge

CWC Meeting: ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు CWC సమావేశం కానుంది. ఢిల్లీలోని AICC ప్రధాన కార్యాలయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే అధ్యక్షతన నిర్వహించే ఈ సమావేశానికి CWC సభ్యులు, శాశ్వత, ప్రత్యేక ఆహ్వానితులు, ఉభయ తెలుగు రాష్ట్రాల నేతలు హాజరుకానున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దామోదర రాజనర్సింహ, చల్లా వంశీచంద్ రెడ్డి హాజరుకానున్నారు.

ఆంధ్రప్రదేశ్ నుంచి రఘువీరా రెడ్డి, టి.సుబ్బిరామిరెడ్డి, పల్లం రాజు, కొప్పల రాజు, గిడుగు రుద్రరాజు సభకు హాజరుకానున్నారు. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో విజయావకాశాలు ఉన్నప్పటికీ పార్టీ ఓటమికి గల కారణాలను విశ్లేషించనున్నారు. పొరపాటు ఎక్కడ జరిగింది, తప్పులు ఎలా సరిదిద్దాలి అన్నది కూడా చర్చకు వస్తుందని అర్థమవుతోంది. దేశంలోని తాజా రాజకీయ పరిస్థితులపై కూడా సీడబ్ల్యూసీ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.
Bhupalpally: ఆస్పత్రికి వెళ్లొచ్చే సరికి ఇళ్లు మొత్తం దోచేశారు..

Show comments