NTV Telugu Site icon

Drugs In Chennai: చెన్నై పోర్ట్లో భారీ డ్రగ్స్ స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్..!

Chennai

Chennai

Drugs In Chennai: భారతదేశ వ్యాప్తంగా డ్రగ్స్ వినియోగం బాగా పెరిగిపోతుంది. దీంతో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అన్ని రాష్ట్ర సర్కార్ లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. విదేశాల నుంచి అక్రమంగా వస్తున్న డగ్స్‌పై ఉక్కుపాదం మోపాలని పలు సూచనలు చేసింది. దీంతో దేశంలోని ప్రధాన ఎయిర్‌పోర్టులు, ఓడరేవులను కస్టమ్స్ అధికారులు విసృతంగా తనిఖీ చేస్తున్నారు. డౌట్ వచ్చిన ప్రతి లాగేజీలు, కంటైనర్లను మొత్తం చెక్ చేస్తున్నారు.

Read Also: Devara : బంగారం లాంటి మా జాన్వీ పాపను కొంచమే చూపెట్టారు..

కాగా, ఈ క్రమంలోనే ఈ రోజు (శుక్రవారం) తెల్లవారుజామున చెన్నై పోర్టులో కస్టమ్స్ అధికారులు భారీ మొత్తంలో డ్రగ్స్‌ను సీజ్ చేశారు. ఓ ముఠా కంటైనర్‌లో అక్రమంగా విదేశాలకు తరలిస్తున్న దాదాపు 110 కోట్ల రూపాయల విలువైన నిషేధిత డ్రగ్స్‌ను కస్టమ్స్ అధికారులు గుర్తించారు. అయితే, చెన్నై పోర్టు నుంచి ఆస్ట్రేలియాకు డ్రగ్స్ తరలిస్తున్నట్లుగా ప్రాథమిక విచారణ తేలింది. దీంతో ఇద్దరు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణను ముమ్మరం చేశారు.