కేంద్ర కేబినెట్‌లో భారీ ప్రక్షాళన చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.. కొత్తగా 43 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేయగా.. 15 మంది కేబినెట్ మంత్రులుగా, 28 మంది సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాదు.. కొత్త మంత్రులకు శాఖలను కూడా కేటాయించారు మోడీ. అయితే.. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న కిషన్‌రెడ్డికి ఏకంగా మూడు శాఖలను అప్పటించారు.
read also : స్టీల్ ప్లాంట్ అమ్మకానికి కేంద్రం మరో ముందడుగు
తనకు ఏ శాఖ ఇచ్చినా… బాధ్యతగా పనిచేస్తానని ఇప్పటికే కిషన్ రెడ్డి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డికి…. సాంసృతిక శాఖ, పర్యాటక శాఖ, మరియు నార్త్ ఈస్ట్రన్ రీజియన్ డెవలప్ మెంట్ బాధ్యతలను కేంద్రం అప్పగించింది. అంతేకాదు.. సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి కేంద్ర పదవి పదవి వరించింది. దీంతో తెలంగాణ బీజేపీలో కొత్త ఉత్సాహం నెలకొంది.