Site icon NTV Telugu

CRPF Man: ‘‘పాకిస్తాన్ మహిళ‌తో పెళ్లితో ఉద్యోగం పోయింది’’.. ప్రధాని మోడీ సాయం కోరిన సీఆర్‌పీఎఫ్ మాజీ కానిస్టేబుల్..

Paki

Paki

CRPF Man: పాకిస్తాన్ మహిళతో తన వివాహాన్ని దాచిపెట్టడం, వీసా ముగిసినా కూడా ఆశ్రయం కల్పించిన కారణంగా సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ మునీర్ అహ్మద్ తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఉద్యోగం నుంచి తీసేస్తూ నిన్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, తనకు అన్యాయం జరిగిందని, నాకు న్యాయం జరిగిందని, ప్రధాని నరేంద్రమోడీ న్యాయం చేయాలని కోరాడు. తన భార్య వీసా గడువు ముగిసిన కూడా భారతదేశంలో ఉంటున్నట్లు అధికారులు లేఖలో పేర్కొన్నారని అహ్మద్ అన్నారు. అయితే, తాను సమాచారం ఇచ్చానని, దానికి సంబంధించిన అన్ని రుజువులు తన వద్ద ఉన్నాయని అహ్మద్ జాతీయ మీడియాతో చెప్పాడు.

Read Also: Pakistani YouTuber: ‘‘వారిని సె*క్స్ బానిసలుగా చేయాలనుకుంటున్నా’’ పాక్ యూట్యూబర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు..

పాకిస్తాన్ జాతీయురాలైన మేనాల్ ఖాన్‌ అనే మహిళను మునీర్ అహ్మద్ పెళ్లి చేసుకున్నాడు. గతేడాది మేలో వీడియో కాల్ ద్వారా వీరి వివాహం జరిగింది. అక్టోబర్ లో వివాహం గురించి సీఆర్‌పీఎఫ్ అధికారులకు తాను తెలియజేసినట్లు మునీర్ చెబుతున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మేనాల్ ఖాన్ వాఘా-అట్టారి సరిహద్దు ద్వారా భారత్‌కి వచ్చి మునీర్‌తో కలిసి నివసించడం ప్రారంభించింది. అయితే, ఆమె 15 రోజుల వీసా మార్చిలోనే ముగిసినప్పటికీ, ఈ విషయాన్ని దాచిపెట్టి మునీర్ ఆమెకు ఆశ్రయం కల్పించాడు. అయితే, తాను తన వివాహం గురించి తెలియజేశానని, ఫిబ్రవరిలో లీవ్ తీసుకున, మళ్లీ మార్చి 23న విధుల్లో చేరానని, నా భార్యకు సంబంధించిన వీసా కాపిని కూడా ఇచ్చి, లాంగ్ టర్మ్ వీసాకు దరఖాస్తు చేసినట్లు చెప్పాడు.

తన తొలగింపు షాక్‌కి గురిచేసిందని మునీర్ అన్నాడు. ఒక జవాన్‌గా నాకు న్యాయం చేయాలని ప్రధాన మంత్రి నరేంద్రమోడీని, హోం మంత్రి అమిత్ షాని కోరుతున్నానని చెప్పాడు. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది మరణించిన తర్వాత, భారత్ పాకిస్తాన్ జాతీయులకు వీసాలు రద్దు చేసి, డెడ్‌లైన్ లోపు వారి దేశానికి వెళ్లాలని ఆదేశించింది. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మునీర్ చర్యలు జాతీయ భద్రతకు హానికరం కాబట్టి ఆయనను తొలగించినట్లు సీఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు.

Exit mobile version