Site icon NTV Telugu

Crocodile: మార్కెట్ సమీపంలోకి 5 అడుగుల మొసలి.. పరుగులు పెట్టిన స్థానికులు

Untitled Design (7)

Untitled Design (7)

ఉత్తరప్రదేశ్‌ ఝాన్సీ జిల్లాలోని బారుసాగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో 5 అడుగుల పొడవున్న మొసలి స్థానిక అల్లం మార్కెట్ సమీపంలోని కాలువలోకి ప్రవేశించింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతంలో మొసలి కనిపించడంతో.. వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించారు స్థానికులు. ఒక బృందం సంఘటనా స్థలానికి చేరుకుని దాదాపు గంటసేపు నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్ తర్వాత మొసలిని సురక్షితంగా పట్టుకున్నారు.

Read Also: Wife Attacked Husband: భార్య కొట్టిందని .. భర్త ఏం చేశాడో తెలుసా..

పూర్తి వివరాల్లోకి వెళితే.. మొసలి బెట్వా నది నుండి దాదాపు 15 కిలోమీటర్ల దూరం ప్రయాణించి బారుసాగర్ అల్లం మార్కెట్ సమీపంలోని కాలువ వద్దకు చేరుకుంది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో, కొంతమంది బాటసారులు కాలువ దగ్గర కదులుతున్నట్లు గమనించి.. భయాందోళనకు గురయ్యారు. అనంతరం అటవీ శాఖకు సమాచారం అందించారు.

Read Also:ఇదేందయ్యా.. ఇది.. ఇంటి పేరులేక పోతే.. ప్లైట్ ఎక్కనివ్వరా…

సమాచారం అందుకున్న పారెస్ట్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానిక పోలీసుల సహాయంతో, మొసలి ఎవరికీ హాని కలిగించకుండా ఉండటానికి వారు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. తాళ్లు, వలలను ఉపయోగించి, బృందం నెమ్మదిగా మొసలిని కాలువ నుండి బయటకు తీసింది. ఈ ఆపరేషన్ గంటకు పైగా కొనసాగింది. మొసలిని సురక్షితంగా బంధించిన తర్వాత, అటవీ శాఖ బృందం దానిని ఒక వాహనంలో ఉంచి బెట్వా నదిలోని దాని సహజ నివాస స్థలంలోకి తిరిగి వదిలివేసింది.

Exit mobile version