Crimes against women increased in delhi: దేశ రాజధాని ఢిల్లీలో మహిళా భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల కాలంలో ఢిల్లీలో ఆడవారిపై అత్యాచారాలు, వేధింపుల కేసులు పెరిగాయి. గతేడాది ప్రథమార్థంతో పోలిస్తే.. ఈ ఏడాది కేసుల సంఖ్య పెరిగింది. ఢిల్లీలో 2022లో మొదటి ఆరు నెలల్లో 1100 అత్యాచార కేసులు నమోదు అయ్యాయి. వీటితో పాటు 1480 మహిళా వేధింపుల కేసులు నమోదు అయ్యాయి. ఢిల్లీ పోలీస్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం.. 2022లో మహిళపై నేరాలు పెరిగినట్లు తెలుస్తోంది. దీంతో పాటు పోలీసుల హెల్ప్ లైన్లు, ఉమెన్ ఫ్రెండ్లీ హెల్ప్ లైన్లపై అవగాహన కూడా పెరిగినట్లు పోలీసులు వెల్లడిస్తున్నారు. దీని వల్లే మహిళలు తమపై జరిగిన నేరాలను చెప్పుకునేందుకు ముందుకు వస్తున్నారని పోలీసులు తెలుపుతున్నారు.
Read Also: Palnadu liquor Problems : ఆ జిల్లాలో చీకటిపడితే చీప్ లిక్కర్ కూడా దొరకడంలేదా..? కారణం ఏంటి..?
అత్యాచారాలు, వేధింపుల కేసులే కాకుండా.. మహిళా కిడ్నాప్ కేసులు గతేడాది ప్రథమార్థం కన్నా 16.8 శాతం పెరిగాయి. 2022లో మొదటి ఆరు నెలల్లో 2197 మహిళా కిడ్నాప్ కేసులు నమోదు అయ్యాయి. ఈ సంఖ్య 2021 ప్రథమార్థంలో 1850గానే ఉంది. ఇదిలా ఉంటే ఊరట ఢిల్లీలో మహిళలపై గృహ హింస 29 శాతం పెరిగింది. అయితే గతేడాది ప్రథమార్థంతో పోలిస్తే ఈ ఏడాది మాత్రం కేవలం 3 వరకట్న వేధింపుల మరణాలు నమోదు అయ్యాయి. చాలా సందర్భాల్లో మహిళలకు తెలిసిన వారే నేరాలకు పాల్పడుతున్నారు. వారు నివసించే ఏరియాకు సమీపంలోనే నేరాలు జరుగుతున్నాయి. ఢిల్లీలో జూలై 15 వరకు అన్ని కేసులు కలుపుని 1.6 లక్షల కేసులు నమోదు అయ్యాయి.
