Site icon NTV Telugu

ఛ‌త్తీస్‌గ‌డ్‌లో విచిత్ర‌మైన కేసుః ఆవుపేడ చోరీ చేశార‌ని…

ఛ‌త్తీస్‌గ‌డ్‌లో విచిత్ర‌మైన కేసు న‌మోదైంది.  ఆవుపేడ‌ను గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు చోరీ చేశార‌ని కేసును ఫైల్ చేశారు.  పోలీసులు దీనిపై ఎఫ్ఐఆర్‌ను కూడా న‌మోదు చేశారు.  కోర్భా జిల్లాలోని ధురేనా గ్రామంలో రూ.1600 విలువ చేసే 800 కేజీల ఆవుపేడ‌ను గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు చోరీ చేశారు.  దీనిపై గ్రామాధికారి పోలీస్ స్టేష‌న్లో ఫిర్యాదు చేశారు.  

Read: సంతోష్ శోభన్ తో చిరంజీవి డాటర్ మూవీ!

గోధ‌న్ న్యాయ్ యోజ‌న ప‌థ‌కం కింద కేంద్ర‌ప్ర‌భుత్వం ఆవు పేడ‌ను కిలో రెండు రూపాయ‌ల చోప్పున కొనుగోలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.  గ్రామాల‌లోని ప్ర‌జ‌ల నుంచి ఆవుపేడ‌ను సేక‌రించి కంపోస్టుగా మారుస్తుంది.  గ్రామీణుల‌కు ఈ ప‌థ‌కం ద్వాదా అద‌నంగా కొంత ఆదాయం ల‌భిస్తుండ‌టంతో ప్ర‌జ‌లు ఆవుపేడ‌ను సేక‌రిస్తున్నారు.  

Exit mobile version