NTV Telugu Site icon

COVID19: వరసగా రెండో రోజు 20 వేలకు పైగా కరోనా కేసులు..

Corona Cases In India

Corona Cases In India

COVID 19 Cases In India: ఇండియాలో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. రోజూవారీ కేసుల సంఖ్య 15 వేలకు పైగా కొనసాగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరగుతోంది. ముఖ్యంగా కేరళ, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. మరో వైపు వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఇండియాలో కోవిడ్ వ్యాక్సినేషన్ డోసుల సంఖ్య 200 కోట్లను దాటింది.

తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 20,409 కేసులు నమోదు అయ్యాయి. మహమ్మారి బారినపడి 32 మంది మరణించారు. గడిచిన ఒక్క రోజులో 22,697 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,43,988కి తగ్గాయి. డైలీ పాజిటివిటీ రేటు 5.12గా ఉండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 4.82గా ఉంది. గడిచిన 24 గంటల్లో యాక్టివ్ కేసుల లోడ్ 2335కు తగ్గింది. దేశంలో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 4,39,79,730కు చేరుకుంది. వీరిలో 5,26,258 మంది మరణించగా.. 4,33,09,484 మంది కోవిడ్ నుంచి రికవరీ అయ్యారు. దేశంలో మొత్తం ఇన్ఫెక్షన్లలో యాక్టివ్ కేసుల సంఖ్య 0.33 శాతంగా ఉండగా.. రికవరీ రేటు 98.46 శాతంగా ఉంది. మరణాల శాతం 1.20గా ఉంది.

ప్రస్తుతం దేశంలో అర్హులైన వారికి 203.60 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ ఇచ్చారు. గురువారం రోజు 38,63,960 మందికి టీకా అందించారు. ప్రస్తుతం నమోదు అయిన 32 మరణాల్లో ఎక్కువ మంది పశ్చిమబెంగాల్, కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన వారే అధికంగా ఉన్నారు. ఇక ప్రపంచంలో కోవిడ్ కేసుల సంఖ్య 57,93,87,454 చేరింది. వీరిలో 64,14,119 మంది మరణించారు.