ఇండియాలో కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం కేసులు 50 వేలకు దిగువున నమోదుకాగా, గత రెండు రోజులుగా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్‌ను రిలీజ్ చేసింది. ఈ బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో ఇండియాలో 54,069 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,00,82,778కి చేరింది.
Read: సరిలేరు… విజయశాంతికెవ్వరు!
ఇందులో 2,90,63,740 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 6,37,057 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక, గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 1321 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 3,91,981కి చేరింది. ఇకపోటే ఒక్కరోజులో 68,885 మంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు బులిటెన్‌లో పేర్కొన్నారు. ఇండియాలో ఇప్పటి వరకు 30,16,26,028 మందికి వ్యాక్సిన్ అందించారు.
