కరోనా మహమ్మారికి చెక్‌పెట్టేందుకు క్రమంగా అన్ని ఏజ్ గ్రూప్‌లకు వ్యాక్సినేషన్‌పై దృష్టిపెట్టింది కేంద్ర ప్రభుత్వం.. దశలవారీగా ఇప్పటికే 12 ఏళ్లు పైబడినవారి వరకు వ్యాక్సినేషన్ కొనసాగుతుండగా.. ఇప్పుడు 5 ఏళ్ల నుంచి 12 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు వ్యాక్సినేషన్‌పై దృష్టిసారించింది ప్రభుత్వం.. అందులో భాగంగా.. ఇవాళ ఎక్స్‌పర్ట్ కమిటీ సమావేశంమైంది.. 5-12 ఏళ్ల వారికి వ్యాక్సిన్ ఇచ్చే అంశంపై చర్చించింది.. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో 5 నుంచి 12 ఏళ్ల మధ్య పిల్లలకు అత్యవసర వాక్సిన్ అనుమతి ఇచ్చే అంశంపై సమాలోచనలు చేసింది. కాగా, భారతదేశపు మొట్టమొదటి ప్రోటీన్ సబ్-యూనిట్ కోవిడ్ వ్యాక్సిన్ 5-12 సంవత్సరాల పిల్లలలో అత్యవసర ఉపయోగం కోసం సిఫార్సు చేసిన విషయం తెలిసిందే.
Read Also: Ukraine War : పుతిన్ బెదిరింపులు ఉత్తుత్తివేనా..?
ఇక, 5-12 సంవత్సరాల వయస్సు గల పిల్లలలో బయోలాజికల్ ఈ… యొక్క కార్బెవాక్స్‌ను అత్యవసరంగా ఉపయోగించాలని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI)కు.. ఎక్స్‌పర్ట్ కమిటీ సిఫార్సు చేసింది… ఈ సిఫార్సులను డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు పంపారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ చిన్న పిల్లలకు వ్యాక్సిన్‌పై ముందుకు వెళ్లే ముందు డ్రగ్ కంట్రోలర్ ఆమోదం కోసం వేచి ఉంటుంది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్‌ను 12-14 ఏళ్లలోపు పిల్లలకు వాడుతోన్న విషయం విదితమే.