Health Awareness Wedding: ఆలోచింపజేస్తున్న ఈ వధూవరుల నిర్ణయం.. ఆ టెస్ట్ తర్వాతే వివాహబంధంలోకి అడుగుపెట్టిన జంట
- హర్యానాలో ఓ ప్రత్యేకమైన పెళ్లి
- ఆ హెల్త్ టెస్ట్ తర్వాతే వివాహబంధంలోకి
- చర్ఖీ దాద్రీ జిల్లాలో జరిగిన ఈ వివాహం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెళ్ళి విషయంలో చాలా మంది అందం, ఆస్తులు, అంతస్తులు చూస్తుంటారు. కానీ కాలం మారే కొద్ది వివాహాల విషయంలో ఆలోచనలు మారుతున్నాయి. నేటి రోజుల్లో ఉద్యోగమే కాదు.. హెల్త్ స్టేటస్ కూడా ముఖ్యమే అని నిరూపిస్తున్నారు కొందరు వధూవరులు. తాజాగా హర్యానాలో ఓ ప్రత్యేకమైన పెళ్లి జరిగింది. వధూవరులిద్దరు ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ఆ హెల్త్ టెస్ట్ తర్వాతే వివాహబంధంలోకి అడుగుపెట్టారు. చర్ఖీ దాద్రీ జిల్లాలో జరిగిన ఈ వివాహం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
నూతన వధూవరులు సాంప్రదాయ ఆచారాలు, అట్టహాసాలకు దూరంగా ఉంటూ, పెళ్లికి ముందు హెచ్ఐవి పరీక్ష చేయించుకున్నారు. నెగటివ్ ఫలితం వచ్చిన తర్వాత, డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ చిత్రపటం ముందు ఒకరినొకరు జీవిత భాగస్వాములుగా స్వీకరించారు. ఈ ప్రత్యేకమైన వివాహంలోని అత్యంత విశేషమైన అంశం ఏమిటంటే, ఇది పూర్తిగా కట్నం రహితంగా, నిరాడంబరంగా జరిగింది. ఆర్భాటాలు లేవు, సాంప్రదాయ వివాహ ఆచారాలు లేవు. వేదికపై, వధూవరులు గులాబీల బదులుగా ఒకరికొకరు పెన్నులను బహూకరించుకుని, విద్య, అవగాహన సందేశాన్ని సమాజానికి చాటిచెప్పారు.
Also Read
- Aadhaar Biometric Update: ఆధార్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఆ ఫ్రీ అప్డెట్కు సెప్టెంబర్ 30 చివరి తేదీ!
- CM Vijay: కరూర్ తొక్కిసలాటకు ఏడాది.. ‘ఎప్పటికీ మానని గాయం’ అంటూ సీఎం విజయ్ భావోద్వేగం
- PM Modi Mann Ki Baat: సర్జికల్ స్ట్రైక్‌కు 10 ఏళ్లు.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
- US LPG Supply: భారత్‌కు ఎల్పీజీ సరఫరాలో అమెరికా సరికొత్త రికార్డు..
చార్ఖీ దాద్రీ నివాసితులైన మనేంద్ర దహియా, మోనికా తన్వార్ వృత్తిరీత్యా కౌన్సిలర్లు. వివాహం అనేది కేవలం ఒక సామాజిక ఆచారం మాత్రమే కాదని, అది నమ్మకం, బాధ్యతతో కూడిన బంధమని వారిద్దరూ తెలిపారు. అందుకే వివాహానికి ముందు ఆరోగ్య పరీక్షలకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. సురక్షితమైన, ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్ధారించుకోవడానికి యువత సంకోచం లేకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని వరుడు మనేంద్ర దహియా కోరారు. హెచ్ఐవి వంటి సమస్యలపై సమాజంలో ఇప్పటికీ బహిరంగంగా చర్చ జరగడం లేదని, అవగాహనే ఉత్తమ రక్షణ అని మోనికా తన్వర్ అన్నారు. ఈ వధూవరులు తీసుకున్న నిర్ణయం ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తోంది.. ఆదర్శవంతమైన ఈ వివాహంపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.
తాజావార్తలు
-
Aadhaar Biometric Update: ఆధార్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఆ ఫ్రీ అప్డెట్కు సెప్టెంబర్ 30 చివరి తేదీ!
-
CM Vijay: కరూర్ తొక్కిసలాటకు ఏడాది.. ‘ఎప్పటికీ మానని గాయం’ అంటూ సీఎం విజయ్ భావోద్వేగం
-
SS Rajamouli 25 Years: కథలు మారాయి, హీరోలు మారారు.. కానీ జక్కన్న ఆలోచన మాత్రం మారలేదు!
-
Pongal 2027 : ఇది అసలైన పోటీ అంటే.. సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ రజనీ
-
Land Fraud: కృష్ణా జిల్లాలో సంచలనం.. ఇలా కూడా స్థలాలు కబ్జా చేస్తారా?
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?