NTV Telugu Site icon

Rajasthan: పెట్రోల్ బంక్‌లో యువకుడు ఓవరాక్షన్.. డీజిల్‌ నేలపాలు.. చివరికిలా..!

Peje

Peje

పెట్రోల్ బంక్ అంటేనే ఎన్నో జాగ్రత్తలు.. భద్రతా ప్రమాణాలు ఉంటాయి. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా భారీ విపత్తే జరగొచ్చు. అంతటి భయంకరమైన పరిస్థితులుంటాయి. అలాంటి చోట ఓ యువకుడు రెచ్చిపోయాడు. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసమో.. లేదంటే ఓవరాక్షన్ తెలియదు గానీ.. డీజిల్ మిషన్ పైపు తీసుకుని కారులో పోస్తుండగా.. ట్యాంక్ నిండిపోయి.. బయటకు వేస్ట్‌గా పోయేలా చేశాడు. అంతేకాకుండా ఈ సీన్లు వీడియోలో పడేలా ఫోజులిచ్చాడు. అలాగే మీసం తిప్పాడు. బంక్ సిబ్బంది ఏ మాత్రం అభ్యంతరం తెల్పలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇది కూడా చదవండి: Shalini : ఆస్పత్రిలో హీరో అజిత్ భార్య.. ఏమైందంటే..?

రీల్స్ కోసం యువత చేస్తున్న చేష్టలు ప్రమాదాలు కొనితెచ్చేలా ఉంటున్నాయి. రాజస్థాన్‌లోని ఒక పెట్రోల్ బంకులో ఒక వ్యక్తి తన కారులోకి ఇంధన ట్యాంక్‌ను ఓవర్‌ఫిల్ చేస్తున్న వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. డీజిల్ ట్యాంక్‌ను పెట్రోల్ బంకులో నింపుతున్నప్పుడు మరొక వ్యక్తి అతనిని గమనిస్తున్నాడు. డీజిల్ కూడా నేలపై పడిపోవడం కనిపించింది. అనంతరం కారు సన్‌రూఫ్‌లో నుంచి వ్యక్తి నిలబడి ఉన్నట్లు వీడియోలో కనిపించింది. 22 సెకన్ల క్లిప్ ముగిసే సమయానికి ఇద్దరు వ్యక్తులు పానీయాలు తాగుతూ కనిపించారు.

ఇది కూడా చదవండి: Nivetha Thomas: నాకు పెళ్లయింది.. నా భర్త, పిల్లలు వీళ్ళే.. నివేదా థామస్ షాకింగ్ కామెంట్స్ !

ఈ వీడియో కాస్త పోలీసుల దృష్టికి వెళ్లింది. జూలై 2న అజ్మీర్ పోలీసులు గమనించారు. మోటారు వాహనాల చట్టం కింద వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన వల్ల పెను విపత్తు సంభవించి ఉండేదని తెలిపారు. వీడియోలో ఉన్న ఫతే సింగ్, మహావీర్ గుజ్జర్‌లను అరెస్టు చేశారు. అలాగే పెట్రోల్ బంకు ఉద్యోగిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక ఈ ఘటనపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఏదైనా జరిగితే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని పేర్కొన్నారు.