కరోనా మహమ్మారి కేసులు తగ్గుముఖం పడుతున్న దాని ప్రభావం ఏ మాత్రం తగ్గడంలేదు. రోజువారి మరణాల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. నిన్న ఒక్కరోజే కరోనాతో 6,148 మంది మృతి చెందారు అంటే వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు. అన్‌లాక్ ప్రక్రియ అమలు జరుగుతుండటంతో ప్రజలు బయటకు వస్తున్నారు. సొంత వాహనాల్లో ప్రయాణించేవారికంటే, సొంత వాహనాల్లో ప్రయాణం చేసేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఏ వాహనంలో ప్రయాణం చేస్తే ముప్పు ఎంత ఉంటుంది అనే దానిపై జాన్ హాప్‌కిన్స్ విశ్వవిధ్యాలయం పరిశోధకులు పరిశోధనలు చేశారు. వీరి పరిశోధనల ప్రకారం, ఆటోలో ప్రయాణం చేసే వారిలో ఒకరి నుంచి కరోనా వైరస్ మరోకరికి సోకే అవకాశం తక్కువగా ఉంటుందని, 40 మంది ప్రయాణించేందుకు వీలుగా ఉండే బస్సుల్లో తీసుకుంటే ఆటోలో ప్రయాణం చేసేవారికంటే 72 రెట్లు అధికంగా, నాన్ ఏసీ కార్లలో 86 రెట్లు, ఏసీ కార్లలో 300 రెట్లు అధికంగా కరోనా సోకే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గాలి, వెలుతురు ఎక్కువగా ఉంటే కరోనా సోకే ప్రమాదం తక్కువగా ఉంటుంది.
ఏ వాహనంలో వైరస్ వ్యాప్తి ఎలా…
