NTV Telugu Site icon

COVID Vaccine: 12-18 ఏళ్ల పిల్లలకు మరో వ్యాక్సిన్‌.. ధర ఎంతంటే..?

కరోనాకు మరో టీకా అందుబాటులోకి వస్తోంది. బయోలాజికల్​-ఈ సంస్థకు చెందిన కార్బెవాక్స్ వ్యాక్సిన్​అత్యవసర అనుమతికి డ్రగ్స్​కంట్రోలర్​ జనరల్​ ఆఫ్​ఇండియా తుది అనుమతులు ఇచ్చింది. 12-18 ఏళ్ల పిల్లలకు రెండు డోసులుగా ఈ టీకాను వేస్తారు. 5 కోట్ల కార్బెవాక్స్‌ డోసుల కోసం ఆ సంస్థకు ఇటీవల కేంద్రం ఆర్డర్‌ పెట్టింది. ఒక్కో డోసును 145 రూపాయలుగా నిర్ణయించింది. దీనికి జీఎస్‌టీ అదనం. ఈ డోసులను ఫిబ్రవరి చివరి నాటికి సంస్థ సరఫరా చేయనున్నట్లు తెలుస్తోంది.

Read Also: UP Polls 2022: నాల్గో దశ పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

ఆర్‌బీడీ ప్రొటీన్‌ ఆధారిత తొలి స్వదేశీ వ్యాక్సిన్‌ అయిన కార్బెవాక్స్‌ అత్యవసర వినియోగానికి ఇటీవల కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదం తెలిపింది. అయితే ఈ టీకాకు అనుమతులు రాకముందే 30 కోట్ల డోసుల కొనుగోలుకు కేంద్రం బయోలాజికల్‌-ఈ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం 1500 కోట్లు చెల్లించింది. ఈ ఒప్పందంలో భాగంగానే డోసుల కొనుగోలుకు ఇటీవల ఆర్దర్‌ పెట్టినట్లు తెలుస్తోంది. ఒకసారి పూర్తిగా టీకాలు వేసిన తర్వాత, పిల్లలు ఎటువంటి భయం లేకుండా పాఠశాలలు, కళాశాలల్లో తమ కార్యకలాపాలు, విద్యా కార్యకలాపాలను తిరిగి ప్రారంభించవచ్చని సంస్ధ తెలిపింది. టీకా షెడ్యూల్ వ్యవధి 28 రోజులుగా నిర్ణయించారు.