Site icon NTV Telugu

ఆస్ప‌త్రిలో దారుణం.. డ‌బ్బుకోసం క‌రోనా రోగి హ‌త్య‌

Chennai GH

ఆస్ప‌త్రిలో జ‌రిగిన ఓ దారుణ‌మైన ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగు చూసింది.. క‌రోనా మ‌హ‌మ్మారి బారిన‌ప‌డిన ఓ మ‌హిళ ఆస్ప‌త్రిలో చికిత్స పొంద‌తుండ‌గా.. ఆమె ద‌గ్గ‌ర ఉన్న డ‌బ్బు, సెల్‌ఫోన్‌పై క‌న్నేసిన కార్మికురాలు.. ఏకంగా ప్రాణాలు తీసింది.. త‌మిళ‌నాడులో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆస్ప‌త్రిలో 41 ఏళ్ల క‌రోనా బాధితురాలు అదృశ్య‌మైపోయింది.. ఆ త‌ర్వాత ఆస్ప‌త్రిలో మైదానంలో ఆమె మృత‌దేహాన్ని గుర్తించారు ఆస్ప‌త్రి సిబ్బంది. అయితే, ఆమెను ఎవ‌రు హ‌త్య చేశారు అనేది మిస్ట‌రీగా మారిపోయింది.. చివ‌ర‌కు మహిళా కాంట్రాక్ట్ కార్మికురాలే ఆమెను హ‌త్య చేసిన‌ట్టు పోలీసులు గుర్తించారు.. క‌రోనా రోగి ద‌గ్గ‌ర ఉన్న న‌గ‌దు, సెల్‌ఫోన్‌ను కొట్టేయాల‌న్న ఉద్దేశంతో.. తిరువొట్టియూర్‌కు చెందిన రతి దేవి అనే కాంట్రాక్టు కార్మికురాలు ఈ ఘాతుకానికి పాల్ప‌డిన‌ట్టు నిర్ధార‌ణ‌కు వ‌చ్చిన పోలీసులు.. ఇవాళ ఆమెను అరెస్ట్ చేశారు.. మొత్తానికి పశ్చిమ తాంబరంలోని కదపేరికి చెందిన క‌రోనా బాధితురాలైన 41 ఏళ్ల సునీతా ప్రాణాలు పోయాయి..

Exit mobile version