NTV Telugu Site icon

బీహార్‌లో కలకలం రేపుతున్న కల్తీ మద్యం

బీహార్ రాష్ట్రంలో కల్తీ మద్యం కలకలం రేపుతోంది.కల్తీ మద్యం తాగి 9 మంది మృతి చెందిన విషాద సంఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. బీహార్‌ రాష్ట్రంలోని గోపాల్‌గంజ్‌ జిల్లాలో కల్తీ మద్యం తాగి తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ కొందరు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ మృతి చెందారు.

మరి కొందరు ఇంట్లోనే మరణించారు. ఇలా 9 మంది మృతి చెందగా.. మరో ఏడుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.