NTV Telugu Site icon

Fairness Cream: మోసపూరిత ప్రకటనలపై ఫెయిర్‌నెస్ క్రీమ్ కంపెనీకి రూ.15 లక్షల ఫైన్

Fireness

Fireness

Fairness Cream: ప్రముఖ ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఇమామి లిమిటెడ్‌పై వినియోగం ఫోరమ్ 15 లక్షల రూపాయల ఫైన్ వేసింది. కంపెనీకి చెందిన ఫెయిర్‌నెస్ క్రీమ్ ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ యాడ్ మోసపూరితంగా.. అలాగే, ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందని ఓ వ్యక్తి కంప్లైంట్ చేశాడు. దీని ఆధారంగా, సెంట్రల్ ఢిల్లీ డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ రిడ్రెసల్ కమిషన్ ఈ కేసును విచారణ చేసింది. అయితే, తాను 2013లో 79 రూపాయలకి క్రీమ్‌ను కొనుగోలు చేశా.. కాగా, ఆ ప్రోడక్ట్ తనకు ఫెయిర్ స్కిన్‌కు సంబంధించిన హామీని ఇచ్చింది అయినప్పటికీ.. అది ఫెయిల్ అయిందని ఫిర్యాదుదారు పేర్కొన్నాడు.

Read Also: Sanjay Malhotra: నేడు ఆర్బీఐ నూతన గవర్నర్‌గా మల్హోత్రా బాధ్యతలు స్వీకరణ

ఇక, ప్యాకేజింగ్, ప్రోడక్ట్ లేబుల్‌పై ఇచ్చిన సూచనల ప్రకారం ఉత్పత్తిని క్రమం తప్పకుండా ఉపయోగించినట్లు కంప్లైంట్ లో ఫిర్యాదుదారుడు చెప్పుకొచ్చారు. కానీ అతను అనుకున్న విధంగా ఫెయిర్‌నెస్ రాలేదు కానీ, ఇతర ప్రయోజనాలు కూడా ఏం లేవని పేర్కొన్నాడు. అయితే, ఫిర్యాదు చేసి వ్యక్తి కంపెనీ సూచనలను సరిగ్గా పాటించలేదు.. క్రీమ్‌ను ఉపయోగించినట్టు ఇంకా రుజువు కాలేదు.. కాబట్టి తమ ప్రోడక్ట్‌లో లోపం లేదని ఇమామి కన్స్యూమర్ కోర్టుకు తెలిపింది. కాగా, కంపెనీ సూచనలను పాటించలేదని ఆరోపణలు చేయడం ద్వారా ఫిర్యాదుదారుని తప్పుబట్టలేమని ఫోరమ్ తెలిపింది. ఇది తప్పుదోవ పట్టించే యాడ్స్, అన్యాయమైన వాణిజ్య పద్దతులను సూచిస్తుందని అధ్యక్షుడు ఇందర్ జీత్ సింగ్, సభ్యురాలు రష్మీ బన్సాల్‌లతో కూడిన ఫోరమ్ ఇమామి లిమిటెడ్‌కి రూ. 15 లక్షల జరిమానా విధించింది.

Show comments