బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్-బీజేపీ మధ్య మాటల-తూటాలు పేలుతున్నాయి. ఇంకా ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. ఓ వైపు ప్రతిపక్ష కాంగ్రెస్.. ఓట్ల చోరీ జరుగుతుందంటూ అటు బీహార్‌లోనూ..ఇటు జాతీయంగానూ పోరాటం చేస్తోంది. ఎన్నికల కమిషన్.. అధికార పార్టీకి తొత్తుగా మారి ఓట్ల చోరీ చేస్తుందంటూ విపక్షం దుమ్మెత్తిపోస్తోంది. అంతేకాకుండా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ బీహార్‌లో యాత్ర కూడా చేపట్టారు. ఇక ఓటర్ అధికార్ యాత్ర సందర్భంగా ఓ కార్యకర్త.. ప్రధాని మోడీ తల్లిని దూషించిన వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఇది ఇంకా చల్లారక ముందే బీహార్ కాంగ్రెస్ మరొక ఏఐ వీడియో విడుదల చేసింది. ఓట్ల చోరీపై కలలో మోడీని తల్లి హీరాబెన్ తిడుతున్నట్లు వీడియోలో కనిపించింది. తాజాగా ఈ వీడియో వైరల్ కావడంతో కాంగ్రెస్‌పై బీజేపీ మండిపడుతోంది.
ఇది కూడా చదవండి: Netanyahu: ఇజ్రాయెల్ ప్రధాని సంచలన ప్రకటన.. పాలస్తీనా దేశంగా ఉండబోదని ప్రతిజ్ఞ
వీడియోలో మోడీని పోలిన పాత్ర రాత్రికి తిరిగి ఇంటికి వచ్చి నిద్రపోతుండగా.. ‘‘నేను ఈరోజు ఓటు చోరీతో ముగించాను. ఇక ఇప్పుడు బాగా నిద్రపోవచ్చు.’’ అంటూ అనుకుంటాడు. ఇంతలో కలలో తల్లి హీరాబెన్ ప్రత్యక్షమై.. తన పేరు ఉపయోగించి ఓట్లు దొంగిలించడానికి రాజకీయాల్లోకి వచ్చినందుకు తిడుతుంది. ఈ సందర్భంగా మోడీని పోలిన పాత్రను మందలించి.. నువ్వు ఎంతవరకు తగ్గడానికి సిద్ధంగా ఉన్నావు?’’ అనగానే ఆశ్చర్యపోయి మేల్కొంటాడు. ఈ వీడియోలో ఎవరి పేర్లు ప్రస్తావించకుండానే బీహార్ కాంగ్రెస్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
ఇది కూడా చదవండి: Manchu Bonding : కరుగుతున్న ‘మంచు’.. మనోజ్ సినిమాకు విష్ణు స్పెషల్ విషెష్
ఇక కాంగ్రెస్ విడుదల చేసిన వీడియోపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. కాంగ్రెస్ అన్ని హద్దులు దాటిపోయిందని.. రాహుల్ గాంధీ అహంకారానికి ఇది నిదర్శనం అంటూ ధ్వజమెత్తింది. చనిపోయిన తల్లిని లక్ష్యంగా చేసుకుని ఇలాంటి అసహ్యకరమైన పనులు చేస్తారా? అంటూ నిలదీసింది. గతంలో చేసిన వ్యాఖ్యలకు పశ్చాత్తాపం వ్యక్తం చేయకుండా.. సమర్థించుకోవడానికి మరొక వీడియో చేస్తారా? అంటూ మండిపడింది.
साहब के सपनों में आईं "माँ"
देखिए रोचक संवाद 👇 pic.twitter.com/aA4mKGa67m
— Bihar Congress (@INCBihar) September 10, 2025
