Site icon NTV Telugu

Communal tension: మైనర్‌పై అత్యాచారం, మసీదుపై రాళ్లదాడి.. నైనిటాల్‌లో ఉద్రిక్తత..

Communal Tension In Nainital

Communal Tension In Nainital

Communal tension: 12 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేశాడనే ఆరోపణలతో ఉత్తరాఖండ్ లోని నైనిటాల్‌లో మతపరమైన ఉద్రిక్తతలు నెలకున్నాయి. ఏప్రిల్ 12న జరిగిన ఈ సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. ఇది స్థానికుల్లో ఆగ్రహానికి కారణమైంది. మహ్మద్ ఉస్మాన్‌గా గుర్తించబడిని 73 ఏళ్ల నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేవారు. గురువారం బాధిత బాలికను వైద్య పరీక్షలకు తరలించారు.

మార్కెట్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న బాలికకు రూ. 200 ఇస్తానని ఉస్మాన్ ప్రలోభపెట్టాడు. ఆ బాలికను తన కారులో ఇంట్లో దించుతానని చెప్పాడు. ఇది నమ్మిన బాలికను కత్తితో బెదిరించి ఆమెపై అత్యాచారం చేశాడు. బాలిక ఈ విషయాన్ని కుటుంబానికి తెలియజేయడంతో, వారు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Read Also: Loan recovery: లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులు భరించలేక రైతు ఆత్మహత్య..

బుధవారం ఈ ఘటన వెలుగులోకి రావడంతో హిందూ సంస్థలు తీవ్ర ఆందోళనలు చేశాయి. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. స్థానిక మసీదుపై రాళ్ల రువ్వారు. స్థానిక పోలీస్ స్టేషన్‌కి భారీ సంఖ్యలో నిరసనకారులు చేరుకోవడంతో పోలీసులకు, నిరసనకారులకు మధ్య తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేదని ఆరోపించారు. కొన్ని ప్రదేశాల్లో గొడవలు చెలరేగడంతో పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు.

పరిస్థితి ఉద్రికత్తం కావడంతో నిందతుడు ఉస్మాన్ ఇంటికి భద్రతను మోహరించారు. అతడి ఇంటిపై నిరసనకారులు రాళ్ల దాడి చేయకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఉస్మాన్ తన ఇంటిని అటవీ భూమి ఆక్రమించి కట్టాడని తేలడంతో మునిసిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లో ఆక్రమణల్ని తొలగించాలని లేకుండా తామే చర్యలు తీసుకుంటామని నోటీసులు జారీ చేసింది.

Exit mobile version