Site icon NTV Telugu

PM Modi: మోడీ ర్యాలీకి హాజరైన కల్నల్ సోఫియా ఖురేషి ఫ్యామిలీ.. ప్రధాని ట్వీట్

Sofiaqureshi

Sofiaqureshi

ప్రధాని మోడీ సోమవారం గుజరాత్‌లో పర్యటించారు. వడోదరలో భారీ రోడ్‌షో చేపట్టారు. కారులోంచి అందరికీ అభివాదం చేసుకుంటూ ముందుకు వెళ్లారు. ఈ రోడ్‌షోలో కల్నల్ సోఫియా ఖురేషి కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. మోడీపై పూల వర్షం కురిపించారు. సోఫియా ఖురేషి తల్లిదండ్రులు, సోదరుడు, సోదరి పూల వర్షం కురిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

ఇది కూడా చదవండి: Vijay Devarakonda : అనిరుధ్ కు విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్..

ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు కల్నల్ సోఫియా ఖురేషి మీడియాకు తెలియజేస్తూ ఉండేవారు. దీంతో ఆమె పాపులర్ అయింది. అయితే ఆమెపై మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా అనుచిత వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ఉగ్రవాదుల.. మన సోదరీమణుల సిందూరాన్ని తుడిచేస్తే.. అదే ఉగ్రవాదుల మతానికి చెందిన సోఫియా ఖురేషిని ప్రధాని మోడీ పాకిస్థాన్‌పైకి పంపించారని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. మధ్యప్రదేశ్ హైకోర్టు కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం కూడా తీవ్ర ఆక్షేపించింది.

ఇది కూడా చదవండి: 2021 నాటికి 65 ఏళ్ల వయసు గల స్త్రీల ఆయుర్దాయం.. ఏ దేశంలో ఎంత శాతమంటే..?

తాజాగా మరోసారి ఖురేషి ఫ్యామిలీ వార్తల్లో నిలిచింది. సోఫియా ఖురేషిది వడోదర. ప్రధాని మోడీ సోమవారం గుజరాత్‌లో పర్యటించారు. వడోదరలో ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో సోఫియా ఖురేషి తల్లిదండ్రులు, ఆమె సోదరుడు మొహమ్మద్ సంజయ్ ఖురేషి, సోదరి సైనా సున్సార్ పాల్గొన్నారు. మోడీపై పూల వర్షం కురిపించారు.

ప్రధాని మోడీని కలవడం చాలా సంతోషంగా ఉందని సోఫియా ఖురేషి సోదరి సున్సారా అన్నారు. మహిళా సాధికారత కోసం మోడీ చాలా చేశారన్నారు. సోఫియా దేశ సోదరిని.. ఆమె అనేక మందికి స్ఫూర్తినిచ్చిందని చెప్పారు.

సోఫియా ఖురేషి కుటుంబం ఆర్మీలో పని చేసిన అనుభవం ఉంది. తాత ఇండియన్ ఆర్మీలో పని చేశారు. సోఫియాకు ఆర్మీతో పరిచయం ఉంది. 1999లో ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ ద్వారా భారత్ సైన్యంలోకి వెళ్లింది. 2016లో ఫోర్స్ 18లో భారత సైనిక శిక్షణా బృందానికి నాయకత్వం వహించిన మొదటి మహిళా అధికారిణిగా చరిత్ర సృష్టించారు.

Exit mobile version