Site icon NTV Telugu

Tamil Nadu: తమిళనాడు డీఎంకేలో కీలక పరిణామం.. ఇద్దరు మేయర్లు రాజీనామా

Mayers

Mayers

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. అధికార డీఎంకేలో రాజీనామాల పర్వం పొలిటికల్‌గా ఆసక్తి రేపింది. కోయంబత్తూరు, తిరునల్వేలి మేయర్లు రాజీనామా చేశారు. కోయంబత్తూరు మేయర్ కల్పన బుధవారం తన వ్యక్తిగత కారణాలతో తన పదవికి రాజీనామా చేసినట్లు కోయంబత్తూరులోని ఒక అధికారి తెలిపారు. డీఎంకేకు చెందిన కల్పన నగరానికి తొలి మహిళా మేయర్‌గా గుర్తింపు పొందారు. ఫిబ్రవరి 2022లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత డీఎంకే, మిత్రపక్షాలు విజయం సాధించడంతో కల్పన మేయర్‌గా ఎన్నికయ్యారు.

ఇది కూడా చదవండి: LK. Advani: ఆస్పత్రి నుంచి ఎల్‌కే అద్వానీ డిశ్చార్జ్

మరోవైపు తిరునల్వేలి మేయర్ పీఎం శరవణన్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామాను ఆమోదించామని అధికారి తెలిపారు. ఇక వీరి రాజీనామాలపై డీఎంకే నుంచి ఎలాంటి స్పందన రాలేదు. వ్యక్తిగత కారణాలా? లేకుంటే ఇంకేమైనా కారణాలున్నాయన్న దానిపై వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: Bahishkarana : వేశ్యగా అంజలి ‘బహిష్కరణ’.. ఎప్పుడు? ఎక్కడ చూడాలంటే?

Exit mobile version