NTV Telugu Site icon

Drugs: సబ్బుల్లో మత్తుపదార్థాలు.. 33.6 కోట్ల విలువైన కొకైన్ సీజ్‌

Cocaine Seized Mumbai Airport

Cocaine Seized Mumbai Airport

Drugs: పోలీసులు ఎంత నిఘా పెడుతున్నా డ్రగ్స్ మాఫియా రెచ్చిపోతోంది. నగరాలను మత్తుపదార్థాల దందాకు కేరాఫ్ గా మార్చుకుంటోంది. పోలీసుల కళ్లుగప్పి డ్రగ్స్ సరఫరా యథేచ్చగా కొనసాగుతోంది. భారత్ మత్తులో ఊగుతోందనడంలో ఆశ్చర్యం లేదు. దేశంలో రోజురోజుకూ డ్రగ్స్ దందా పెరిగిపోతోంది. విద్యార్థులు, సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, ఐటీ ఉద్యోగులే టార్గెట్ గా డ్రగ్స్ అక్రమ రవాణా భారీ ఎత్తున జరుగుతోంది. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై వంటి మెట్రో సిటీల్లో డ్రగ్స్ దందా జోరుగా సాగుతోంది. తాజాగా ముంబాయి ఎయిర్ పోర్ట్ లో భారీ గా డ్రగ్స్ పట్టుబడింది. సుమారు 33.6 కోట్ల విలువ చేసే 3.36 కేజీల కొకైన్ ను DRI అధికారులు సీజ్ చేశారు. కొకైన్ ను సబ్బుల్లో దాచి తరలించే యత్నం చేశాడు కేటుగాడు. విశ్వసనీయ సమాచారం మేరకు DRI అధికారులు నిందితుడిపై అనుమానంతో తన లగేజ్‌ బ్యాగ్‌ ను తనిఖీలు చేసేందుకు ప్రయాణికున్ని అడగగా.. అతను ససేమిరా అన్నాడు.

Read also: Samath Kumb: నేటి నుంచి సమతా కుంబ్‌ ఉత్సాలు.. 9 కుండాలతో యాగం

అయితే అధికారులు అతనిపై ఇంకా అనుమానం పెరగడంతో.. తన లగేజ్‌ బ్యాగ్‌ ను తీసుకుని పరిశీలించారు. అయితే అందులో సబ్బులు బయటపడ్డాయి. అతను తన దగ్గర సబ్బులు తప్పా ఇంకా ఏమీ లేదని వాదించడంతో .. DRI అధికారులు అతని మాటలను అంత సీరియస్‌ గా తీసుకోలేదు. అయితే సబ్బులు ఎందుకు తీసుకుపోతున్నావని అడగటంతో.. సమాధానం ఇవ్వడానికి ప్రయాణికుడు తడపబడ్డాడు. ఇథియోపియా ప్రయాణీకుడిని DRI అధికారులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అసలు గుట్టు రట్టైంది. తను సబ్బుల్లో కొకైన్ గుట్టుగా తరలిస్తున్నట్లు చెప్పడంతో.. అధికారులు షాక్‌ కు గురయ్యారు. సబ్బులను తీసి పరీక్షించగా.. అందులో తెలివిగా కొకైన్‌ ను పెట్టి ప్యాక్‌ చేసినట్లు దానిని దేశవిదేశాలకు తరలిస్తున్నట్లు తెలిపాడు నిందితుడు. 16 చిన్న సబ్బు పెట్టెలను స్వాధీనం చేసుకున్నారు. అధికారులు సబ్బుల మైనపు పొర క్రింద ఏదో దాగి ఉన్నారని గమనించారు. సభ్యుల్లో 3.36 కేజీల కొకైన్ వుందని దీని విలువ 33.6 కోట్లు వుంటుందని తెలిపారు. ఇథియోపియా చెందిన ప్రయాణికున్ని అదుపులో తీసుకుని NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి DRI బృందాలు దర్యాప్తు చేస్తున్నారు.
Fire Accident: హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు

Show comments