Site icon NTV Telugu

Yogi Adityanath: నల్ల చొక్కాలతో కాంగ్రెస్ నిరసన తెలపడం “రామ భక్తుల్ని” అవమానపరచడమే

Yogi Adityanath

Yogi Adityanath

CM Yogi Adityanath comments on congress protested wearing black clothes: కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా శుక్రవారం రోజు నిరసన, ఆందోళన కార్యక్రమాలను నిర్వహించింది. పెరుగుతున్న ధరలు, ద్రవ్యోల్భనం,  జీఎస్టీ రేట్లపై నిరసన తెలిపాయి. నల్ల చొక్కాలు ధరించిన కాంగ్రెస్ ఎంపీలు ఢిల్లీలో తీవ్ర నిరసన తెలిపారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ,  మల్లికార్జున ఖర్గే, అధిర్ రంజన్ చౌదరి వంటి నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు రాహుల్ గాంధీతో పాటు ప్రియాంకా గాంధీని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. దీంతో పాటు రాష్ట్రాల్లో కూడాా కాంగ్రెస్ పెద్ద ఎత్తున నిరసనలు తెలిపింది. కేంద్రం ప్రజస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని.. నియంతల చేతిలో దేశం ఉందని రాహుల్ గాంధీ విమర్శించారు.

Read Also: Vice-President Election 2022: రేపే ఉప రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్.. అదే రోజు ఫలితాలు

అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నేతలు నల్ల చొక్కాలు ధరించి నిరసన తెలపడాన్ని బీజేపీ విమర్శిస్తోంది.  రామ జన్మభూమి నిర్మాణానికి నాంది పలికిన…అయోధ్య దివాస్ రోజే కాంగ్రెస్ నేతలు నల్ల చొక్కాలు వేసుకోవడాన్ని యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్య నాథ్ విమర్శించారు. ఇన్నాళ్లు మామూలుగా నిరసన తెలిపిన కాంగ్రెస్ నాయకులు, అయోధ్య దివాస్ రోజే నల్ల చొక్కాలు ధరించడంలో మతలబేంటని ప్రశ్నించారు.  ఇది రామ భక్తులను అవమాన పరచడమే అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇటువంటి చర్యలతో భారతదేశ విశ్వాసాలను అవమానించిందని.. కాంగ్రెస్ వైఖరి ప్రజాస్వామ్యాన్ని, న్యాయవ్యవస్థను అవమానపరిచేలా ఉన్నాయని యోగీ అన్నారు. కాంగ్రెస్ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు.

మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులపై విమర్శలు గుప్పించారు. బుజ్జగింపు రాజకీయాలను మరింత ప్రోత్సహించేందుకే .. కాంగ్రెస్ ఈ విధానాన్ని ఎంచుకుందని.. ప్రధాని మోదీ రామ జన్మభూమికి పునాది వేసిన ఈ రోజునే సందేశాన్ని ఇవ్వాలనే ఇలా నల్ల రంగు బట్టలు ధరించి నిరసన తెలిపారని అమిత్ షా అన్నారు. కాంగ్రెస్ పార్టీ చట్టానికి సహకరించాలని.. ఫిర్యాదుల ఆధారంగానే ఈడీ విచారిస్తోందని.. దేశంలోని శాంతిభద్రతలను అందరూ గౌరవించాలని అమిత్ షా కాంగ్రెస్ పార్టీకి సూచించారు.

Exit mobile version