తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ను సీనియర్ నటుడు, రాజ్యసభ ఎంపీ కమల్‌హాసన్ కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఎక్స్‌లో పంచుకున్నారు. ‘‘నేను ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రి, సోదరుడు విజయ్‌ను వ్యక్తిగతంగా కలిసి నా శుభాకాంక్షలు తెలియజేశాను.’’ అని రాసుకొచ్చారు. ఈ సందర్భంగా జ్ఞాపకంగా కొన్ని పుస్తకాలను అందజేశారు.
‘‘తమిళనాడు అభివృద్ధికి సంబంధించిన అనేక కలలను ఉత్సాహంగా పంచుకున్నారు. సమావేశంలో విజయ్ చూపించిన దయ, ప్రేమ హృదయాన్ని హత్తుకునేలా ఉన్నాయి. పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమిళ చిత్ర పరిశ్రమకు ప్రభుత్వం అందించే మద్దతు, ఆదరణపై 6 ముఖ్యమైన అభ్యర్థనలు చేశాను. దీని ఫలాలు మరింత వర్ధిల్లాలి.’’ అని రాసుకొచ్చారు.
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే ఘన విజయం సాధించింది. 108 స్థానాలు గెలుచుకుని అతి పెద్ద పార్టీగా అవతరించింది. దీంతో ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ఫ్లోర్ టెస్ట్‌లో 144 ఎమ్మెల్యేల మద్దతు లభించింది. ఇక సీఎంగా బాధ్యతలు చేపట్టాక నేరుగా మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ కలిశారు.
மாண்புமிகு தமிழ்நாடு முதலமைச்சர், தம்பி விஜய் @TVKVijayHQ அவர்களை இன்று நேரில் சந்தித்து வாழ்த்துகளைத் தெரிவித்தேன்.
தமிழ்நாட்டை மேம்படுத்தும் பல கனவுகளை உற்சாகத்துடன் பகிர்ந்துகொண்டார். சந்திப்பின்போது அவர் காட்டிய பண்பும் அன்பும் நெகிழ்ச்சியளித்தது.
பல்வேறு இடையூறுகளைச்… pic.twitter.com/timwTZeEdY
— Kamal Haasan (@ikamalhaasan) May 16, 2026
