Site icon NTV Telugu

Uttarakhand: ఉత్తరాఖండ్ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ.. సీఎం పుష్కర్ సింగ్ ఓటమి

ఉత్తరాఖండ్ ఎన్నికల్లో బీజేపీ విజయం వైపు దూసుకెళ్తున్నా ఆ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఖతిమా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పుష్కర్‌ సింగ్‌ ధామి కాంగ్రెస్‌ అభ్యర్థి చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. సీఎం పుష్కర్ సింగ్‌పై కాంగ్రెస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భువన్ చంద్ కప్రీ 6,951 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

కాగా ఖతిమా నియోజకవర్గంలో మొత్తం 91,325 ఓట్లు పోలవగా పుష్కర్ సింగ్ ధామికి 40,675, కాంగ్రెస్ అభ్యర్థి భువన్ కప్రీకి 47,626 ఓట్లు వచ్చాయి. 70 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరాఖండ్‌ అసెంబ్లీలో బీజేపీ పార్టీ 48 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా దూసుకుపోతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు 36 స్థానాలు అవసరం కాగా.. 48 సీట్ల ఆధిక్యంలో బీజేపీ ఉంది. మరో వైపు ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ 18 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇతరులు నాలుగు స్థానాల్లో ఆధిక్యం కనపరుస్తున్నారు.

Exit mobile version