Site icon NTV Telugu

రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధానికి దీదీ లేఖ‌… గ‌వ‌ర్న‌ర్‌ను మార్చేయండి..!

Mamata Banerjee

అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు… ఎన్నిక‌ల స‌మ‌యంలో.. ఆ త‌ర్వాత కూడా ప‌శ్చిమ బెంగాల్ రాజ‌కీయాలు హాట్ టాపిక్‌గానే మారిపోతున్నాయి.. గ‌వ‌ర్న‌ర్‌ను మార్చాలంటూ తాజాగా టీఎంసీ అధినేత్రి, బెంగాల సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ… రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవిండ్, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి లేఖ‌లు రాయ‌డం సంచ‌ల‌నంగా మారింది..నారద స్కామ్‌లో ఇద్దరు మంత్రులు, మాజీ మంత్రి, మాజీ మేయర్‌తో పాటు నలుగురు తృణమూల్ నేత‌ల‌ను సీబీఐ అరెస్ట్ చేసిన త‌ర్వాత ఈ లేఖ‌లు రాశారు దీదీ.. రాష్ట్రంలో సుపరిపాలన కోసం గవర్నర్‌ను వెంట‌నే మార్చాలని విజ్ఞ‌ప్తి చేశారు. కాగా, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన త‌ర్వాత‌.. గవర్నర్ జగదీప్ ధంఖర్.. టీఎంసీ స‌ర్కార్‌కు వ్యతిరేకంగా అసాధారణమైన రీతిలో మాట్లాడుతున్నారు.. శాంతి, భ‌ద్ర‌త‌ల‌ను అదుపులో ఉంచ‌క‌పోతే తీవ్ర చ‌ర్య‌లు తప్ప‌వంటూ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీని హెచ్చ‌రించారు. అయితే, ప్ర‌స్తుతం పరిస్థితి పూర్తి నియంత్రణలో ఉంద‌ని.. అధికారులు పూర్తిగా క‌రోనా నిరోధ‌న‌లో బిజీగా ఉన్నారని లేఖ‌లో ప్ర‌ధానికి వివ‌రించారు దీదీ.. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో శాంతి, భద్రతల సమస్యను లేవనెత్తడం, దాని గురించి పబ్లిక్ డొమైన్‌లో ట్వీట్ చేయడం ద్వారా ధంఖర్ అన్ని పరిమితులను దాటుతున్నారని.. ప్ర‌భుత్వ ప‌నితీరును అస్థిర‌ప‌రిచేందుకు గ‌వ‌ర్న‌ర్ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని.. సుప‌రిపాల‌న అందించాలంటే వెంట‌నే గ‌వ‌ర్న‌ర్‌ను మార్చేయాల‌ని పేర్కొన్నారు.

Exit mobile version