పొలిటికల్ ఆనాలసిస్ట్ ప్రశాంత్ కిషోర్ (పీకే)తో పొత్తు గురించి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్‌తో కలిసే పనిచేస్తామని ఆమె స్పష్టం చేశారు. అయితే గత కొన్ని రోజుల నుంచి ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇటీవలే పీకే తాను కాంగ్రెస్‌లో చేరడం లేదని ప్రకటించిన తరువాత.. మమతా బెనర్జీ ఈ ప్రకటన చేయడం విశేషం. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మమతా బెనర్జీ మాట్లాడుతూ. ప్రశాంత్ కిశోర్‌కు ఓ రాజకీయ సిద్ధాంతం లేదని, కాంగ్రెస్‌లో సీనియర్లు తీవ్ర అభ్యంతం వ్యక్తం చేశారన్నారు.
అయినా.. సోనియా ముందుకే కదిలారని, అచ్చు ఇలాంటి వాతావరణమే తృణమూల్‌లోనూ ఉందని ఆమె వెల్లడించారు. పీకే సైద్ధాంతిక నిబద్ధతపై తృణమూల్ సీనియర్లు కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయినా తాను పీకేతో ప్రయాణించడానికే మొగ్గు చూపానని మమతా తెలిపారు. మా పార్టీలో కూడా పీకేపై భిన్నాభిప్రాయాలు ఉన్నయన్న మమతా.. ఆయనకిచ్చే బాధ్యతలపై కూడా తేడాలున్నాయని ఆయన పేర్కొన్నారు. అయినా… పీకేతోనే కలిసి ప్రయాణించాలని నిర్ణయించుకున్నామని ఆమె తెలిపారు.