NTV Telugu Site icon

KCR: దేశంలో సెన్సేషన్ జరగాలి…. జరుగుతుంది… మీరే చూస్తారు

Kcr

Kcr

దేశంలో విద్యావ్యవస్థ తీరుపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో కలిసి సర్వోదయ స్కూల్ ను సందర్శించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న విద్యావిధానం పూర్తిగా ఏక పక్షంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కేంద్రం తీసుకువస్తున్న నూతన విద్యా విధానంపై రాష్ట్రాలతో సంప్రదించలేదని అన్నారు. తెలంగాణలో విద్యా విధానాన్ని మార్పు చేస్తామని అన్నారు.

దేశంలో  సెన్సేషన్ జరగాలి… జరుగుతుంది అని కేసీఆర్ అన్నారు. రాబోయే కాలంలో ఏం జరుగుతుందో మీరే చూస్తారని వ్యాఖ్యానించారు. విద్య విషయంలో ఢిల్లీ ప్రభుత్వం తీసుకువస్తున్న విధానాలు విప్లవాత్మకంగా ఉన్నాయని ఆయన అన్నారు. విద్యార్థులను జాబ్ సీకర్స్ గా మరుస్తున్నారని కేసీఆర్ అన్నారు. దేశంలో ఇలాంటి విధానం లేదన్నారు. ఢిల్లీ విద్యావిధానం గురించి తెలుసుకునేందుకు త్వరలోనే తెలంగాణ టీచర్లు, సంఘాల నేతలను ఢిల్లీకి పంపిస్తామని అన్నారు కేసీఆర్.

ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ బిజీ బిజీగా ఉన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో కలిసి సర్వోదయ స్కూల్ ను సందర్శించారు. పాఠశాల ప్రాంగణానికి చేరుకున్న సీఎం కేసీఆర్ బృందానికి ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా  స్వాగతం పలికారు. అనంతరం అక్కడి సమావేశ మందిరంలో విద్యాభివృద్ధి పై ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను కేసీఆర్ తిలకించారు. ఢిల్లీలో విద్యాభివృద్ధి దిశగా కేజ్రీవాల్ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలను, స్కూల్ కరికులమ్ లను, అక్కడి అధికారులు సహా ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కేసీఆర్  కు వివరించారు.

అంతకు ముందు ఢిల్లీలో సీఎం కేసీఆర్ ఉత్తర్ ప్రదేశ్ ప్రతిపక్ష నేత, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తో భేటీ అయ్యారు. దాదాపుగా రెండున్నర గంటలు సేపు వీరిద్దరి మధ్య భేటీ జరిగింది. దేశంలో ప్రస్తుత రాజకీయాలపై సీఎం కేసీఆర్, అఖిలేష్ యాదవ్ తో చర్చించారు. ఆ తరువాత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో రాజకీయాలపై చర్చించారు.