NTV Telugu Site icon

Ranveer Allahbadia: ‘‘తల్లిదండ్రులు అది చేస్తుంటే చూస్తావా.?’’ యూట్యూబర్ అరెస్టుకి రంగం సిద్ధం..

Ranveer Allahbadia

Ranveer Allahbadia

Ranveer Allahbadia: యూట్యూబర్, పాడ్‌కాస్టర్ రణవీర్ అల్లాబాడియా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తిస్తున్నాయి. రోస్ట్ షోలో ఆయన చేసిన వ్యాఖ్యల్ని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. పరిమితులు దాటి ఎవరైనా అమర్యాదగా ప్రవర్తిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అల్లాబాడియాపై ఇద్దరు ముంబై న్యాయవాదులు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ వివాదంపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. ‘‘దీని గురించి నాకు సమాచారం అందింది, అయితే నేను ఇంకా చూడలేదు. ఇది చాలా అసభ్యకరంగా ఉందని మరియు ఇది తప్పు అని నాకు తెలిసింది. ప్రతి ఒక్కరికీ వాక్ స్వేచ్ఛ ఉంటుంది కానీ మనం ఇతరుల స్వేచ్ఛను ఆక్రమించినప్పుడు ఈ స్వేచ్ఛ ముగుస్తుంది. ప్రతి ఒక్కరికీ పరిమితులు ఉంటాయి, ఎవరైనా వాటిని దాటితే, చర్య తీసుకోబడుతుంది’’ అని అన్నారు.

Read Also: Punjab: పంజాబ్‌ పాటియాలాలో పట్టుబడిన రాకెట్ మందుగుండు సామాగ్రి..

ఒక షోలో యూట్యూబర్ రణవీర్ అల్లాబాడియా చేసిన వ్యాఖ్యలపై న్యాయవాదులు ఆశిష్ రాయ్, పంకజ్ మిశ్రాలు ముంబై పోలీస్ కమిషనర్ వివేక్ ఫల్శంకర్, రాష్ట్ర మహిళా కమిషన్‌కు లేఖ రాశారు.‘‘ఇండియాస్ గాట్ టాలెంట్’’లో చేసిన వ్యాఖ్యలు మహిళలను అగౌరపరచడమే అని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేవారు. మహిళల శరీరాల గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బు సంపాదించాలనే ఏకైక ఉద్దేశంతోనే వారు ఈ వ్యాఖ్యలు చేశారని న్యాయవాదులు పేర్కొన్నారు.

షోలో రణవీర్ మాట్లాడుతూ. ‘‘నీ తల్లిదండ్రులు జీవితాంతం ప్రతిరోజూ సెక్స్ చేయడం చూడటం నీకు ఇష్టమా..? లేక ఒక్కసారి అందులో చేరి, జీవితం మొత్తం చూడకుండా ఉండటం నీకు ఇష్టమా..?’’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా నేతలు స్పందిస్తున్నారు. అతడిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేట్ డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యాఖ్యలకు చప్పట్లు కొట్టడం మనల్ని ఆందోళనకు గురి చేస్తుందని అన్నారు. ఇది క్రియేటివిటీ కాదని, వక్రబుద్ధి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.