Site icon NTV Telugu

Delhi Election Results: విజయోత్సవ సంబరాల్లో డ్యాన్స్ చేసిన ముఖ్యమంత్రి

Atishi

Atishi

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి చెందినా.. ముఖ్యమంత్రి అతిషి మాత్రం కల్కాజీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు. దీంతో ఆమె మద్దతుదారులు, కార్యకర్తలతో కలిసి ఉల్లాసంగా.. ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. పార్టీ శ్రేణులతో కలిసి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మ్యూజిక్ తగినట్టుగా నృత్యం చేశారు. కార్యకర్తలను ఉత్తేజపరిచారు. కల్కాజీలో బీజేపీ అభ్యర్థి రమేశ్ బిధురిపై అతిషి విజయం సాధించారు.

ఇది కూడా చదవండి: Tamannaah Bhatia : చిరుత పులి డ్రస్ వేసుకుని అందాలతో అదరగొట్టేసిన తమన్నా

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 48 స్థానాలు బీజేపీ కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. దాదాపు 27 ఏళ్ల తర్వాత హస్తినలో కమలం పార్టీ సర్కార్‌ను ఏర్పాటు చేయనుంది. ఇక ఆప్ 22 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇక ఓటమిని కేజ్రీవాల్ స్వాగతించారు. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను పోషిస్తామని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఇక ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ఘోర పరాజయం పాలయ్యారు.

Exit mobile version