Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ యువకుల కోసం ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ ప్రోగ్రామ్‌ను ప్రకటించారు. వారి కమ్యూనికేషన్ నైపుణ్యాలను, ఉద్యోగావకాశాలను మెరుగుపరచడంలో ఈ కార్యక్రమం సహాయపడుతుందన్నారు. రూ.950 డిపాజిట్ మొత్తంతో 18-35 ఏళ్ల వయస్సు గల వ్యక్తులు ఆంగ్లం నేర్చుకోవచ్చన్నారు. కోర్సు విజయవంతంగా పూర్తయిన తర్వాత ఈ మొత్తం తిరిగి ఇవ్వబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఢిల్లీ స్కిల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ యూనివర్సిటీ నిర్వహిస్తుందని కేజ్రీవాల్ వెల్లడించారు.
“కమ్యూనికేషన్ స్కిల్స్ లేని యువకుల కోసం స్పోకెన్ ఇంగ్లిష్ ప్రోగ్రామ్‌ను ప్రకటిస్తున్నాం. ఢిల్లీ స్కిల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ యూనివర్సిటీ ఈ కోర్సును నిర్వహిస్తుంది. 12వ తరగతి వరకు చదివిన, కమ్యూనికేషన్ స్కిల్స్ తక్కువగా ఉన్న విద్యార్థులు ఈ కోర్సును ఎంచుకోవచ్చు. ఆంగ్ల పరిజ్ఞానం లేక యువకులు ఉద్యోగాలను పొందడంలో సమస్యలను ఎదుర్కొంటున్నారని.. 8వ తరగతి వరకు ఆంగ్లంపై ప్రాథమిక పరిజ్ఞానం ఉన్నవారు కూడా ఈ కోర్సులో చేరవచ్చు” అని కేజ్రీవాల్ చెప్పారు.
Election Commission: శివసేన ఎవరిదో తేల్చేందుకు రంగంలోకి ఈసీ.. పత్రాలు సమర్పించాలని ఆదేశం
“ఇది వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించడానికి, విద్యార్థుల ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడానికి సహాయపడుతుందని ఢిల్లీ సీఎం అన్నారు. మొదటి దశలో దాదాపు లక్ష మంది విద్యార్థులకు శిక్షణ అందించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని విస్తరింపజేస్తామని ప్రకటించారు. మొదటి దశలో ఢిల్లీలోని 50 కేంద్రాల్లో ఒక సంవత్సరంలో 1 లక్ష మంది విద్యార్థులకు శిక్షణను అందిస్తామన్నారు, 18-35 సంవత్సరాల వయస్సు గల యువకులు ఈ 3 నుంచి 4 నెలల్లో ఆంగ్లం నేర్చుకోవచ్చన్నారు.