Site icon NTV Telugu

Cloudburst in Uttarakhand: ఉత్తరాఖండ్లో మరోసారి క్లౌడ్ బరస్ట్.. పలువురు గల్లంతు!

Uttarkhand

Uttarkhand

Cloudburst in Uttarakhand: ఉత్తరాఖండ్‌లో మరోసారి క్లౌడ్ బరస్ట్ అయింది. చమోలీ జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి ధాటిన తర్వాత భారీ వర్షం కురిసింది. దీంతో మెరుపు వరద పోటెత్తడంతో అనేక ఇళ్లను వరద ప్రవాహాం ముంచెత్తింది. వెహికిల్స్ మొత్తం బురదలో కూరుకుపోయాయి. సగ్వారా గ్రామంలో ఓ యువతి శిథిలాల కింద కూరుకుపోయి ప్రాణాలు విడిచింది. ఆకస్మిక వరదల కారణంగా పలువురు గల్లంతైనట్లు సమాచారం.

Read Also: TDP Key Meeting: నేడు టీడీపీ కీలక భేటీ.. పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

అయితే, సమాచారం అందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. ఇక, నివాసాల్లో చిక్కుకుపోయిన స్థానికులను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌సింగ్‌ ధామి ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. స్థానిక అధికార యంత్రాంగంతో మాట్లాడి ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రజలంతా సురక్షితంగా ఉండాలని కోరారు.

Exit mobile version