Site icon NTV Telugu

Cloudburst in Uttarakhand: ఉత్తరాఖండ్‌లో క్లౌడ్‌ బరస్ట్‌.. కొట్టుకుపోయిన గ్రామం!

Uttarakhand

Uttarakhand

Cloudburst in Uttarakhand: ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో మరోసారి ప్రకృతి ప్రకోపాన్ని చూపించింది. హర్సిల్ ప్రాంతానికి సమీపంలోని గంగోత్రీ పరిధిలోని ధరావలి గ్రామంలో భారీ క్లౌడ్‌ బరస్ట్‌ చోటు చేసుకుంది. ఈ ఘటనతో కొండచరియలు విరిగిపడి గ్రామంపైకి దూసుకు రావడంతో ఒక్కసారిగా ఆ ఊరు మొత్తం తుడిచి పెట్టుకుపోయింది. ఇక, కొండచరియల కింద పలువురు గ్రామస్థులు చిక్కుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై ఉత్తరకాశీ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్ ఆర్య అధికారిక ప్రకటన రిలీజ్ చేశారు. క్లౌడ్‌ బరస్ట్‌ కారణంగా గ్రామంలో భారీ నష్టం జరిగింది. దీని వల్ల పలు ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్పుకొచ్చారు. అయితే, పరిస్థితిని అంచనా వేసేందుకు అధికారులు సంఘటనా స్థలానికి ఇప్పటికే చేరుకుని.. రక్షణ చర్యలు తక్షణమే చేపట్టారు.

Read Also: Daddy Movie: ‘డాడీ’లో చిరంజీవి కూతురు ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

అలాగే, అప్రమత్తమైన రెస్క్యూ టీమ్స్ హెలికాప్టర్లు, స్థానిక వనరులతో సహాయక చర్యలు చేపట్టారు. కొండచరియల కింద చిక్కుకుపోయిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో వర్షాలు భారీగా కురుస్తున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే, అధికారులు, స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పరిస్థితి నియంత్రణలోకి వచ్చే వరకు సహాయక చర్యలు నిరంతరంగా కొనసాగుతాయని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ ఆర్య వెల్లడించారు.

Exit mobile version