Site icon NTV Telugu

JNU: రావణులుగా ఉమర్ ఖలీద్, షార్జీల్ ఇమామ్.. జెఎన్‌యూలో ఘర్షణలు..

Jnu

Jnu

JNU: జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు)లో దుర్గా విగ్రహ నిమజ్జన ఊరేగింపుపై వామపక్ష అనుబంధ విద్యార్థి సంఘాలు దాడి చేశాయని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) గురువారం ఆరోపించింది. అయితే, ఏబీవీపీ ‘‘రావణ దహన’’ కార్యక్రమాన్ని మత రాజకీయం కోసం వాడుకుంటోందని వామపక్ష విద్యార్థి సంఘాలు ఆరోపించాయి.

ఎఐఎస్‌ఎ, ఎస్‌ఎఫ్‌ఐ, డిఎస్‌ఎఫ్‌తో సహా వామపక్ష సంఘాలు రాత్రి 7 గంటల ప్రాంతంలో సబర్మతి టి-పాయింట్ సమీపంలో నిమజ్జన ఊరేగింపుపై “హింసాత్మకంగా దాడి” చేశాయని, ఈ దాడిలో విద్యార్థులు గాయపడినట్లు ఏబీవీపీ ఒక ప్రకటనలో తెలిపింది. రాళ్ల దాడిలో గాయపడిన వారిలో మహిళలు కూడా ఉన్నట్లు చెప్పింది.

Read Also: Pakistan: పాకిస్తాన్ పెషావర్‌లో బాంబు పేలుడు.. 9 మంది మృతి..

ఏబీవీపీ జేఎన్‌యూ అధ్యక్షుడు మయాంక్ పంచల్ మాట్లాడుతూ.. ఇది కేవలం ఒక మతపరమైన కార్యక్రమంపై జరిగిన దాడి కాదు, విశ్వవిద్యాలయ పండుగ సంప్రదాయం, విద్యార్థుల విశ్వాసంపై ప్రత్యక్ష దాడిగా అభివర్ణించారు. యూనివర్సిటీ పరిపాలన అధికారులు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అయితే, జేఎన్‌యూ వామపక్ష అనుబంధ ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) ఆరోపణలను తోసిపుచ్చింది. సీఏఏ వ్యతిరేక నిరసనలు, ఢిల్లీ అల్లర్లకు కుట్ర సంబంధించి నిందితులుగా ఉన్న జేఎన్‌యూ మాజీ విద్యార్థులు ఉమర్ ఖలీద్, షార్జీల్ ఇమామ్ రావణుడిగా చిత్రీకరించారని ఆరోపించింది. ఇది ఇస్లామోఫోబియా అని, మతపరంగా లబ్ధి పొందేందుకు ఏబీవీపీ ప్రయత్నిస్తోందని పేర్కొంది.

Exit mobile version