CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్‌మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ

  • సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి
  • విపక్ష నేతలకు అపాయింట్‌మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
  • మధ్యాహ్నం సుప్రీంకోర్టుకు నేతలు పాదయాత్ర
Cji

Cji

ఇండియా కూటమి నేతలు సోమవారం సుప్రీంకోర్టుకు పాదయాత్ర కార్యక్రమం చేపట్టారు. మధ్యాహ్నం 1:30 గంటలకు పాదయాత్ర ప్రారంభం కానుంది. కాంగ్రెస్‌తో పాటు విపక్ష పార్టీలన్నీ పాల్గొననున్నాయి. అయితే సీజేఐ సూర్యకాంత్‌ను కలిసేందుకు విపక్ష నేతలు అపాయింట్‌మెంట్ కోరారు. అయితే అపాయింట్‌మెంట్ ఇచ్చేందుకు సీజేఐ నిరాకరించారు.

తాజాగా ఈ విషయంపై సూర్యకాంత్ క్లారిటీ ఇచ్చారు. సుప్రీంకోర్టు తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని తెలిపారు. ప్రతిపక్ష నాయకులకు అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడానికి గల కారణాన్ని సీజేఐ వివరించారు. ఆదివారమే విపక్ష నాయకులను కలవకపోవడానికి గల కారణాలను లేఖ ద్వారా వివరించానని చెప్పారు. శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని.. అందుకే కలవలేకపోతున్నట్లు వివరించారు. కోర్టు తలుపులు అందరికీ తెరిచే ఉంటాయని.. ఎవరైనా కోర్టుకు రావచ్చని స్పష్టం చేశారు.

సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని.. ‘సర్’ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత కొద్దిరోజులుగా విపక్ష నేతలు ఆందోళనలు చేస్తున్నారు. ఢిల్లీ వేదికగా నిరసనలు జరుగుతున్నాయి. తాజాగా సోమవారం సుప్రీంకోర్టుకు పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.