Site icon NTV Telugu

Helicopter Crash in Kedarnath: కేదర్‌ నాథ్‌లో ఘోర ప్రమాదం.. హెలికాప్టర్‌ కూలి 6 మంది మృతి

Helicopter Crash In Kedarnath

Helicopter Crash In Kedarnath

Helicopter crash in banswara near kedarnath: ఉత్తరాఖండ్‌ లో ఘోర ప్రమాదం జరిగింది. కేదార్‌నాథ్‌లో యాత్రికులను తీసుకువెళుతున్న ఓ హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైంది. హెలికాప్టర్ కుప్పకూలడంతో ఆరుమంది చనిపోయారు. మృతుల్లో ఇద్దరు పైలట్లు ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. టేకాప్‌ అయిన కొద్దిసేపటికే హెలికాప్టర్‌ నుంచి పొగలు వ్యాపించాయని.. పైలట్లు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. హెలికాప్టర్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయిందని తెలుస్తోంది. బంస్వారా సమీపంలోని చట్టి అటవీ ప్రాంతంలో హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైందని అధికారులు వెల్లడించారు. పొగమంచు దట్టంగా పేరుకుపోవడం వల్ల ఈ ఘటన జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి వుంది. చనిపోయిన వారు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.

కేదార్‌నాథ్‌లో హెలికాప్టర్ ప్రమాదం చాలా దురదృష్టకరమని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సినిడా ట్వీట్ చేశారు.

Exit mobile version