NTV Telugu Site icon

Nepal: నేపాల్ కరెన్సీపై భారత ప్రాంతాలు.. ముద్రించనున్న చైనా..

India Nepal Relations

India Nepal Relations

Nepal: నేపాల్ తన కరెన్సీ నోట్లపై భారత భూభాగాలను ముద్రించడం ద్వారా మన దేశ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించింది. ఆ దేశ కరెన్సీని చైనా ముద్రించడం గమనార్హం. భారతదేశ భూభాగాలైన లింపియాధుర, లిపులేక్, కాలాపానీ ప్రాంతాలను తమ భాగాలుగా నేపాల్ చూపించుకునే ప్రయత్నం చేసింది. నేపాల్ సెంట్రల్ బ్యాంక్ అయిన నేపాల్ రాష్ట్ర బ్యాంక్ కొత్త 100 రూపాలయ నోట్లపై భారత భూభాగాలను ముద్రించింది. ఈ కాంట్రాక్టును చైనా కంపెనీకి ఇచ్చింది.

Read Also: KA Movie Review: క సినిమా రివ్యూ.. కిరణ్ అబ్బవరం హిట్ కొట్టాడా?

భారతదేశానికి అత్యంత వ్యూహాత్మక ప్రాంతాలైన ఈ మూడు ప్రాంతాలను నేపాల్ తమవిగా చెప్పుకుంటోంది. దీనిపై గతంతో పెద్ద వివాదమే నడిచింది. జూన్ 18, 2020లో లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురాలను తమ భూభాగాలుగా చెబుతూ.. ఆ దేశం రాజ్యాంగాన్ని సవరించింది. ఈ చర్యలను భారత్ తీవ్రంగా తప్పుపట్టింది. మరోసారి వీటిని నేపాల్ దాని కరెన్సీ నోట్లపై ముద్రించడం ద్వారా మరోసారి వివాదాన్ని రాజేసింది. ప్రస్తుతం ఈ మూడు భాగాలు కూడా భారతదేశ ఆధ్వర్యంలోనే ఉన్నాయి.

చైనా బ్యాంక్ నోట్ ప్రింటింగ్, మింటింగ్ కార్పొరేషన్ ఈ నేపాల్ నోట్ల ముద్రణ కాంట్రాక్ట్‌ని పొందింది. 300 మిలియన్ నేపాల్ రూపాలయ విలువైన రూ. 100 నోట్ల డిజైన్‌ని ప్రింట్ చేసి డెలివరీ చేయాల్సిందిగా చైనా కంపెనీని కోరింది. దీని ప్రింటింగ్ ఖర్చు సుమారు 8.99 మిలియన్ డాలర్లుగా ఉంటుందని రిపబ్లికా పేపర్ నివేదించింది. నేపాల్ భారతదేశంలోని ఐదు రాష్ట్రాలైన సిక్కిం, పశ్చిమబెంగాల్, బీహార్, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లతో 1850 కి.మీ సరిహద్దును పంచుకుంటుంది.