India-China: చైనాను ఏ రకంగా కూడా నమ్మలేని, భారత్‌ను హెచ్చరిస్తూ టిబెల్ లీడర్ లోబ్సాంగత్ సంగే అన్నారు. ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ మాజీ అధ్యక్షుడు(సిక్యాంగ్) లోబ్సాంగ్ సంగే జాతీయ మీడియాతో మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు. అరుణాచల్ ప్రదేశ్‌ను ఆక్రమించేందుకు చైనా ప్రయత్నిస్తోందని, భారత్ డ్రాగన్ దేశాన్ని ఎప్పుడూ నమ్మవద్దని హెచ్చరించారు. చైనా, భారతదేశంలో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని పలు గ్రామాలకు పేర్లు మార్చడం, సరిహద్దుల్లో సైనిక మౌళిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో సంగే నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి.
గతంలో భారత్‌ను చైనా నమ్మించి ద్రోహం చేసిన సంఘటనలను ఆయన వివరించారు. ‘‘పంచశీల్‌పై 1954లో సంతకం చేశారు, 1962 నాటికి యుద్ధం మొదలైంది. 1979లో అటల్ బిహారీ వాజ్‌పేయి విదేశాంగ మంత్రిగా చైనాను సందర్శించినప్పుడు, వియత్నాం యుద్ధం కొనసాగుతోంది. జి జిన్‌పింగ్ 2015లో భారతదేశానికి వచ్చారు, రెండు సంవత్సరాలలోపు డోక్లాం జరిగింది. 2019లో, భారతదేశం- చైనా 70 సంవత్సరాల సంబంధాలను జరుపుకున్నాయి, దీని తర్వాత 2020లో గాల్వాన్ ఘటన జరిగింది’’ అని చెప్పారు.
Read Also: Garba Rules: “సరైన దుస్తులు, సిందూరం, ఆధార్”.. నవరాత్రి గర్బా కోసం బజరంగ్ దళ్ నియమాలు..
14 ద్రోహాల తర్వాత కూడా భారత్ చైనాతో సంబంధాలను రీసెట్ చేస్తోందని, గతంలో జరిగిన దాడులు తాలూకూ గాయాలను స్కాచ్ టేప్‌తో కట్టిస్తున్నారని ఆయన అన్నారు. చైనా అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో హైస్పీడ్ రైల్వేలు, హైవేలు, సైనిక స్థావరాలను నిర్మిస్తోందని, వారు దండయాత్రకు సిద్ధమవుతున్నారని అన్నారు. చైనాకు టిబెట్ అరచేయి అయితే, లడఖ్, నేపాల్, భూటాన్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ఐదు వేళ్లుగా చెబుతోందని, వాటిని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తోందని సంగే అన్నారు.
హిమాలయాలను నియంత్రించడం అంటే దక్షిణాసియాపై పట్టు, ముఖ్యంగా భారత్‌పై ఆధిపత్యం చెలాయించడమని చైనా గురించి హెచ్చరించారు. ‘‘హిందీ-చిని భాయ్ భాయ్’’ అనే నినాదంలో ‘‘చిని’’ని చక్కెరతో పోల్చారు. హిందీ( భారత్), చిని(చైనా)ను ఎప్పుడూ తాకకూడదని, అది ఆరోగ్యానికి మంచిది కాదని అన్నారు. ప్రపంచంలో నెంబర్ వన్ కావాలంటే భారత్ ఆధిపత్యాన్ని తొలగించాలని, పోటీలో ఉండకూడదని చైనా భావిస్తోందని అన్నారు.
