NTV Telugu Site icon

చైనా ప్రపంచ శక్తిగా మారేందుకు ప్రయత్నిస్తోంది : బిపిన్‌ రావత్‌

చైనా ప్రపంచ శక్తిగా మారేందుకు ప్రయత్నిస్తోందని త్రిధళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ అన్నారు. చైనా-పాక్‌ సంబంధంపై మాట్లాడిన బిపిన్‌.. ఆ దేశాల మధ్య ఉన్న సంబంధం భారత్‌కు వ్యతిరేకం అని అన్నారు. అంతేకాకుండా వివిధ దేశాలలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు చైనా సిద్ధమైందని, ఫలితంగా ఆ దేశాలపై పట్టు సాధించేందుకు ఎత్తుగడలు వేస్తోందని అన్నారు.

దక్షిణాసియాలో చైనా చర్యలు ప్రమాదకరంగా మారుతున్నాయని ఆయన అన్నారు. భారత సరిహద్దులో చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. చైనా బలమైన దేశమైనా, భారత్‌ మాత్రం బలహీన దేశం కాదని ఆయన అన్నారు. భారత భూభాగంలో చైనా దురాక్రమణకు దిగితే తగిన రీతిలో బుద్దిచెబుతామని హెచ్చరించారు.