NTV Telugu Site icon

Intersex surgery: శిశువులపై సెక్స్ సర్జరీ నిషేధించాలన్న అభ్యర్థనపై కేంద్రం సమాధానం కోరిన సుప్రీంకోర్టు..

Supreme Court

Supreme Court

Intersex surgery: పుట్టుకతోనే ఇంటర్ సెక్స్ సర్జీర సమస్యలపై న్యాయపరమైన జోక్యం కోరుతూ దాఖలైన పిటిషన్‌ని విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ విషయంపై భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ కేంద్రం సమాధాన్ని కోరుతూ నోటీసులు జారీ చేశారు. పిల్లలను మగ లేదా ఆడగా మార్చడానికి వారి అంగీకారం లేకుండానే పుట్టుకతో ఇంటర్ సెక్స్ సర్జరీలకు గురిచేస్తు్న్నారని పిటిషన్ పేర్కొంది. ఇలాంటి వైద్యపరమైన జోక్యం శిక్షార్హమైన నేరమని, వాటిని అరికట్టేందుకు చట్టం ఉండాలని పిటిషనర్ కోరారు.

Read Also: CSK vs KKR Dream11 Prediction: చెన్నై, కోల్‌కతా డ్రీమ్ 11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్!

ఇలాంటి శస్త్రచికిత్సలను నిషేధించిన తొలి రాష్ట్రంగా తమిళనాడు ఉందని పిటిషన్ పేర్కొన్నారు. 2019లో మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు పుట్టిన శిశువు లింగం స్పష్టంగా లేని సమయంలో చేసే సెక్స్ అసైన్మెంట్ శస్త్రచికిత్సలను తమిళనాడు నిషేధించింది. ప్రాణాపాయ పరిస్థితుల్లో తప్పా ఇలాంటి శస్త్రచికిత్సలను నిషేధించాలని గతంలో హైకోర్టు పేర్కొంది. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం.. దాదాపుగా 1.7 శాతం మంది పిల్లలు మగ లేదా ఆడ అనే సెక్స్ లక్షణాలు లేకుండా జన్మిస్తారు.

ఇంటర్ సెక్స్ పిల్లలు పదేపదే సర్జరీలకు గురికావడం, చికిత్స చేయడం ద్వారా వారి లింగం, రూపాన్ని మార్చడం తరుచుగా శాశ్వత వంధ్యత్వం, జీవితా కాల నొప్పి, లైంగిక అనుభూతిని కోల్పోవడం, మానసిక బాధలకు కారణమవుతుందని ఐక్యరాజ్యసమితి చెప్పింది. ఈ విధానాల వల్ల పిల్లలపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు కలిగి ఉంటుందని, ఇలాంటి సర్జరీలకు ఎలాంటి వైద్యపరమైన కారణం లేదని చెప్పింది. అనుమతి లేకుండా వీటిని నిర్వహించడం మానవహక్కుల ఉల్లంఘనే అవుతుందని యూఎన్ నొక్కి చెప్పింది. ఇంటర్ సెక్స్ పిల్లలకు వైద్యపరంగా అనవసరమైన శస్త్రచికిత్సలను, విధానాలను నిషేధించాలని ప్రభుత్వాలను కోరింది.