Site icon NTV Telugu

Chhattisgarh: సమతా పేరిట సంచలన లేఖ విదుదల చేసిన మావోయిస్టులు

Chatishghad Maoist

Chatishghad Maoist

Chhattisgarh: కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) సౌత్ సబ్ జోనల్ బ్యూరో సమతా పేరిట సంచలన లేఖను మావోయిస్టులు విదుదల చేశారు. ఛత్తీస్‌గడ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ఒక ముసుగు, అతను కార్పొరేట్‌కు నంబర్ వన్ ఏజెంట్ అని లేఖలో పేర్కొన్నారు. పోలీసు రిక్రూట్‌మెంట్‌లో గిరిజన యువతకు ఎత్తు, ఛాతీ కొలతల్లో సడలింపు ఇవ్వాలని మంత్రి మండలి నిర్ణయం వెనుక కుట్ర దాగి ఉందని అందులో మావోలు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌ను పోలీసురాజ్యంగా చేసి గిరిజన సమాజాన్ని నాశనం చేసే కుట్రను అందరు వ్యతిరేకించాలని పిలుపు నిచ్చారు.

Read also: Samantha : బేబీ బంప్‎తో సమంత .. వైరల్ అవుతున్న ఫోటోలు

బీజేపీ ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్‌ను కార్పోరేట్ కంపెనీలకు చౌకగా సేవలందించేందుకు గిరిజన యువతను పోలీసు శాఖలో చేర్చుకుంటున్నారు. రాష్ట్రంలో అనేక శాఖలు ఉన్నాయి. ఈ విభాగాలన్నింటిలో ఖాళీగా ఉన్న పోస్టులకు రిక్రూట్‌మెంట్ లేదు. కేవలం పోలీసు రిక్రూట్‌మెంట్ మాత్రమే నిరంతరం జరుగుతోందన్నారు. రోడ్లు, టెలిఫోన్లు, వంతెనలు, రైల్వే లైన్లు, ఓడల స్థావరాలు తదితరాలను కార్పొరేట్ల కోసం నిర్మిస్తున్నారు. దీని భద్రత కోసం పోలీసులను మోహరిస్తున్నారు. గ్రామాలు, పొలాల్లో బాంబులను పేల్చుతున్నారు. ప్రతిరోజూ గ్రామాలపై దాడులు చేసి వందలాది మందిని అరెస్టు చేసి జైల్లో పెడుతున్నారు. గిరిజన సమాజాన్ని కాపాడాలంటే ఫాసిస్ట్ బీజేపీ ప్రభుత్వాలపై బలమైన ఉద్యమం జరగాలి అంటూ లేఖలో ప్రధానంగా ప్రస్థావించిన మావోలు.
Kamareddy Crime: వీడిన త్రీ సూసైడ్స్ మిస్టరీ.. అందుకే ఆ ముగ్గురు మృతి..

Exit mobile version