Site icon NTV Telugu

Chhath Festival: నేటి నుంచి 4 రోజులు బీహార్‌లో ఛత్ పండుగ.. ప్రత్యేక ఇదే!

Chhath Festival

Chhath Festival

బీహార్‌లో ప్రస్తుతం ఓట్ల పండుగ జరుగుతోంది. తాజాగా ఓట్ల పండుగతో పాటు తరతరాలుగా ఆచారంగా వస్తున్న ఛత్ ఫెస్టివల్‌ కూడా వచ్చేసింది. దీంతో రాష్ట్రమంతటా సందడి.. సందడి వాతావరణం.. కోలాహలం కనిపిస్తోంది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు ఛత్ పండుగ జరగనుంది. ఈ పండుగ కోసం రాష్ట్రం బయట ఎక్కడున్నా సరే సొంత గ్రామాలకు వచ్చేస్తారు. అంత ఉత్సాహంగా.. ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటారు. ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఛత్ పండుగ శుభాకాంక్షలు చెప్పారు.

ఛత్ ప్రత్యేకత ఇదే..?
ఛత్ అనేది ఒక పురాతన ఇండో-నేపాల్ హిందూ పండుగ. తూర్పు భారతదేశం-దక్షిణ నేపాల్‌కు చెందిన పండుగ. ముఖ్యంగా భారతదేశంలోని బీహార్, జార్ఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ పండుగ జరుపుకుంటారు. అలాగే నేపాల్‌లోని కోషి, గండకి, బాగ్మతి, లుంబిని, మాధేష్ ప్రావిన్సుల్లో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. విదేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులు కూడా ఎంతో ఆనందంగా ఈ ఫెస్టివల్‌ను నిర్వహిస్తారు.

ఛత్ పండుగను దీపావళి తర్వాత 6 రోజులకు జరుపుకుంటారు. ఈ పండుగను ‘‘సూర్య షష్టి వ్రతం’’గా పిలుస్తారు. మూడు రాత్రులు-నాలుగు పగళ్లు ఆచరాలు పాటిస్తారు. ఎంతో భక్తితో ఉపవాసం ఉండి.. పవిత్ర సాన్నం చేసి సూర్య నమస్కారాలు చేస్తారు. వ్యక్తిగత కోరికలు నెరవేర్చాలని కోరుతూ సూర్యుడికి ప్రార్థనలు చేస్తారు. అందుకే ఈ పండుగను ‘‘సూర్య షష్టి వ్రతం’’గా పిలుస్తారు. ఇక భక్తులంతా ఒకేలాటి ప్రసాదాలు, నైవేద్యాలు సిద్ధం చేసుకుంటారు.

నైవేద్యాలు ఇవే:
తేకువా: ఛత్ పూజ సమయంలో ప్రసిద్ధమైన నైవేద్యం ‘తేకువా’. దీనిని గోధుమ పిండి, బెల్లం, నెయ్యితో కరకరలాడేలా తయారు చేస్తారు. ఇదొక తీపి చిరుతిండి.
రెండోది రసబలి: చదును చేసిన బియ్యంను తియ్యటి పాలలో నానబెట్టి, యాలకులు, ఎండిన పండ్లతో రుచిగా తయారు చేసే డెజెర్ట్.
మూడోవది కాసర్ (లడ్డూ): బియ్యం పొడి లేదా గోధుమ పిండి, బెల్లంతో తయారు చేసే లడ్డూ. చిన్న సైజులో తయారు చేసి పవిత్ర నైవేద్యంగా భావిస్తారు.
నాల్గోవది బియ్యం లడ్డూ (పీఠ): బెల్లం, కొబ్బరిని ఆవిరితో ఉడికిస్తారు.

ఈ వంటకాలు నైవేద్యాలు మాత్రమే కాదు. ఛత్ పండుగలో స్వచ్ఛత, భక్తి, సాంస్కృతి గొప్పతనాన్ని సూచిస్తాయి. ఛత్ పండుగ అనేది అత్యంత పర్యావరణ అనుకూల మత పరమైన పండుగుల్లో ఒకటిగా పర్యావవరణవేత్తలు అభివర్ణిస్తారు.

విశిష్టత ఇదే..
ఛత్ పూజను సూర్య దేవుడికి అంకితం చేస్తారు. ఛత్ మాతను కూడా పూజిస్తారు. పిల్లలకు అనారోగ్యాలు, వ్యాధుల నుంచి రక్షణ, దీర్ఘయుష్షుతో పాటు మంచి ఆరోగ్యం లభిస్తుందని ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం. అక్టోబర్ 25 నుంచి 28 వరకు నాలుగు రోజుల పాటు చాలా భక్తితో నిర్వహిస్తారు. ఈ పండుగను మహిళలే కాకుండా.. పురుషులు కూడా ఎంతో భక్తిశ్రద్ధలతో చేపడతారు. ఉదయం సూర్య భగవానుని పూజించిన తర్వాత రాత్రిపూట ఛత్ పాటలు పాడతారు. అంతేకాకుండా వ్రత కథను చదువుతారు. ప్రతి రోజు ఉదయం 5-7 చెరుకు కర్రలను కలిపి ఒక మండపాన్ని ఏర్పాటు చేస్తారు. దాని కింద 12-24 దీపాలు వెలిగించి తేకువాతో పాటు సీజనల్‌లో వచ్చే పండ్లను సమర్పిస్తారు. మరుసటి రోజు ఉదయం 3-4 గంటల మధ్యే ఈ ఆచారాన్ని పూర్తి చేసేస్తారు. అనంతరం సూర్యుడు ఉదయించగానే సూర్య నమస్కారాలు చేసి వ్యక్తిగత కోరికలను తీర్చాలని ప్రార్థిస్తారు. అనంతరం నైవేద్యాలను అంకితం చేస్తారు. ప్రతి రోజున నది ఒడ్డునే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

 

Exit mobile version